6.8లక్షల మొబైల్‌ నంబర్లను ధ్రువీకరించాలన్నటెలి​కాంశాఖ

Published on Fri, 05/24/2024 - 12:33

ఉపయోగంలోలేని, నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న 6.8 లక్షల మొబైల్ కనెక్షన్లను ధ్రువీకరించాలని టెలికాం శాఖ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొబైల్‌ నంబర్లను 60 రోజుల్లోపు గుర్తించి వెంటనే రీ-వెరిఫికేషన్ చేయాలని తెలిపింది. లేదంటే వాటిని డిస్‌కనెక్ట్‌ చేస్తామని హెచ్చరించింది.

నకిలీ ఫోన్‌ నంబర్లు, ఉపయోగంలోలేని కనెక్షన్లను గుర్తించడానికి టెలికాంశాఖ అధునాతన ఏఐను వినియోగించినట్లు ప్రకటనలో చెప్పింది. ఏఐ విశ్లేషణలో భాగంగా ఉపయోగంలోలేనివి, నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో ఉన్న దాదాపు 6.8 లక్షల మొబైల్‌ కనెక్షన్లు గుర్తించినట్లు తెలిపింది. వెంటనే నెట్‌వర్క్‌ ఆపరేటర్లు వాటిని ధ్రువీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ 60 రోజుల్లోపు పూర్తి చేయాలని చెప్పింది.

ఇదీ చదవండి: అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండి

ఒకవేళ ఆపరేటర్లు ముందుగా విధించిన గడువులోపు మొబైల్‌ నంబర్లను ధ్రువీకరించకపోతే వాటిని డిస్‌కనెక్ట్‌ చేస్తామని హెచ్చరించింది. అవసరమైతే కొందరు ఆపరేటర్లు ఈ తంతును మళ్లీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2024 ఏప్రిల్‌లో టెలికాంశాఖ 10,834 మొబైల్ నంబర్‌లపై అనుమానం వ్యక్తంచేస్తూ వీటిని రీవెరిఫికేషన్‌ చేయాలని తెలిపింది. వీటిలో 8,272 కనెక్షన్లు ధ్రువీకరణలో విఫలమవడంతో డిస్‌కనెక్ట్ చేసినట్లు పేర్కొంది.

Videos

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)