Breaking News

స్పెక్ట్రమ్‌ వేలం వాయిదా..కొత్త తేదీ ఖరారు

Published on Wed, 06/05/2024 - 11:12

స్పెక్ట్రమ్‌ వేలాన్ని జూన్‌ 25కు వాయిదా వేస్తున్నట్లు టెలికా విభాగం(డాట్‌) ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్‌ ప్రకారం ఈ వేలం జూన్‌ 6(గురువారం)న నిర్వహించాల్సి ఉంది. వాయిదాకుగల కారణాలను మాత్రం డాట్‌ వెల్లడించలేదు.

మొబైల్‌ ఫోన్‌ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లను రూ.96,317 కోట్ల కనీస ధరతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 800 - 900 - 1800 - 2100 - 2300 - 2500 - 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్‌ బ్యాండ్‌ల స్పెక్ట్రమ్‌ను వేలంలో విక్రయించనుంది. అందులో ఎలాగైనా గరిష్ఠవాటాను సొంతం చేసుకోవాలని టాప్‌ కంపెనీలు ఈఎండీ చెల్లించి, అధిక పాయింట్లు పొందేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రక్రియ కోసం రిలయన్స్‌ జియో రూ.3,000 కోట్ల మొత్తాన్ని (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌-ఈఎండీ) డిపాజిట్‌ చేయడం ద్వారా అత్యధిక రేడియో తరంగాలకు బిడ్‌ వేసేందుకు ప్రణాళికలు సిద్ధ చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌ రూ.1,050 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.300 కోట్ల ఈఎండీని డిపాజిట్‌ చేశాయి.

ఇదీ చదవండి: జూన్‌ 14 తర్వాత ఆధార్‌ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ

స్పెక్ట్రమ్‌ అంటే?

సెల్‌ఫోన్లు, రేడియోలు వంటి వైర్‌లెస్‌ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార మార్పిడికి విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్‌ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్‌ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్‌లుగా వర్గీకరించారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)