Breaking News

పాత టూత్‌బ్రష్‌కు పునర్జన్మ

Published on Sat, 09/05/2026 - 12:22

రోజూ వాడే టూత్‌బ్రష్‌ను రెండు మూడు నెలలకోసారి మార్చేయాలంటూ ఆరోగ్య నిపుణులు చేసే సూచనలు చాలామంది పాటిస్తుంటారు. అది మంచి అలవాటే కానీ, పడేసిన బ్రష్‌లోని ప్లాస్టిక్‌ హ్యాండిల్‌, నైలాన్‌ బ్రిజిల్స్‌ భూమిలో కలవడానికి వందల ఏళ్లు పడతాయి. దేశవ్యాప్తంగా రోజూ లక్షలాది టూత్‌బ్రష్‌లు చెత్తకుప్పల్లోకి చేరుతూ మైక్రోప్లాస్టిక్‌ కాలుష్యాన్ని పెంచుతున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ హానిలో వీటి శాతం తక్కువే అయినా దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత అందిరిపై ఉంది. ఈ నేపథ్యంలో పాత బ్రష్‌ను నేరుగా పారేయకుండా ఇంట్లో వివిధ అవసరాలకు తిరిగి వాడుకోవడం ద్వారా వ్యర్థాలను తగ్గించవచ్చు.

ఇంట్లో పాత టూత్‌బ్రష్‌ను ఉపయోగించే మార్గాలు

1. షూస్‌ శుభ్రం చేయడానికి – బూట్ల మడతల్లో, సోల్‌ కింద ఇరుక్కున్న మట్టిని తొలగించేందుకు అనువుగా ఉంటుంది.

2. కిచెన్‌ సింక్‌ కుళాయి, పైపుల కీళ్లు శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది.

3. నగలు తళతళలాడించేందుకు – కొన్ని వెండి, ఇతర అభరణాల్లోని కీళ్లలో ఇరుక్కున్న మురికిని తొలగించవచ్చు.

4. కీబోర్డ్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాల మధ్య దుమ్ము తీసేందుకు అనుకూలం.

5. గార్డెనింగ్‌లో – చిన్న మొక్కల ఆకులపై మృదువుగా దుమ్ము తొలగించేందుకు వాడొచ్చు.

6. గ్రౌట్‌ లైన్లు (టైల్స్‌ మధ్య సందులు) శుభ్రం చేయడానికి ఉత్తమం.

7. కారు డాష్‌బోర్డ్‌, ఏసీ వెంట్స్‌లోని దుమ్మును తీసేందుకు ఉపయోగపడుతుంది.

8. జిప్పులు, బటన్‌ హోల్స్‌ వంటి బట్టల చిన్న భాగాలను శుభ్రం చేసేందుకు.

9. పెయింటింగ్‌, క్రాఫ్ట్‌ వర్క్‌ల్లో టెక్స్చర్‌ ఎఫెక్ట్స్‌ సృష్టించేందుకు వాడొచ్చు.

10. వంటగదిలో గ్రేటర్‌, స్టీమర్‌ వంటి పరికరాల సందుల్లో అంటుకున్న ఆహార పదార్థాలను తొలగించేందుకు అనుకూలం.

ఇలా ఒక్క టూత్‌బ్రష్‌ను పలు రకాలుగా వినియోగించడం ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించడంతోపాటు ఇంటి పనులను సులభతరం చేసుకోవచ్చు. చిన్న అలవాటు మార్పుతో పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే బయోడీగ్రేడబుల్‌ లేదా వెదురు హ్యాండిల్‌ బ్రష్‌లను ఎంచుకోవడం మరింత మేలైన పరిష్కారం.

ఇదీ చదవండి: మీ వీధిలోనే ఉన్నారు ఫైనాన్స్‌ గురువులు

#

Tags : 1

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!