Breaking News

గుకేశ్‌ ప్రైజ్‌మ‌నీలో చెల్లించాల్సిన ట్యాక్స్ ఎంతంటే?

Published on Mon, 12/16/2024 - 14:53

అతి చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్​గా నిలిచిన డీ గుకేశ్‌కు దేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్, టెక్ సీఈఓ సుందర్ పిచాయ్ శుభాకాంక్షలు తెలిపారు. 58 ఎత్తుల్లోప్రత్యర్థి ఆటకు చెక్‌ పెట్టిన గుకేశ్‌ ప్రైజ్ మనీ కింద సుమారు రూ.11 కోట్లు పొందనున్నారు. అయితే ఇందులో ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది? చివరగా చేతికి వచ్చేది ఎంత అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

వరల్డ్ చెస్ పెడరెషన్ (ఫిడే) ప్రకారం.. చెస్ ఛాంపియ‌న్‌షిప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.20.75 కోట్లు. ఒక గేమ్ గెలిచిన వారికి రూ.1.68 కోట్లు ఇస్తారు. ఇలా గుకేష్ మూడు గేమ్స్ గెలిచాడు. ఈ లెక్కన మొత్తం రూ.5.04 కోట్లు గుకేష్ సొంతమయ్యాయి. రెండు గేమ్స్ గెలిచిన డింగ్‌కు రూ. 3.36 కోట్లు దక్కాయి. అంటే మొత్తం ఛాంపియ‌న్‌షిప్ ప్రైజ్ మనీతో ఇద్దరు ఆటగాళ్లు రూ.8.40 కోట్లు కైవసం చేసుకోగా.. మిగిలిన రూ.12.35 కోట్లను ఇద్దరికీ సమానంగా పంచుతారు. ఇలా గుకేశ్‌కు రూ.11 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అందుతుంది.

గుకేశ్‌కు వచ్చిన ప్రైజ్ మనీతో 30 శాతం లేదా రూ.4.67 కోట్లు ట్యాక్స్ కింద కట్ చేస్తారు. ఈ లెక్కన మొత్తం పన్నులు చెల్లించిన తరువాత గుకేష్ చేతికి అంతేది రూ.6.33 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గెలిచింది గుకేష్ కాదు, ఆర్ధిక శాఖ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది టీడీఎస్.. అంటే ట్యాక్స్ డిటెక్టెడ్ బై సీతారామన్ అని మరికొందరు చెబుతున్నారు. ఆట ఆడకుండానే.. ఆదాయపన్ను శాఖ గెలిచిందని ఇంకొకరు అన్నారు. ఆటగాళ్లపై విధించే ట్యాక్స్​లను తగ్గించాలని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు.

ఐపీఎల్ వేలంలో కూడా..
ఇటీవల జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా క్రికెటర్ 'రిషబ్ పంత్' ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్.. 27 కోట్ల రూపాయలకు పలికినప్పటికీ, పన్నులు వంటివి పోగా అతని చేతికి వచ్చే డబ్బు చాలా తగ్గుతుంది. పంత్ ఐపీఎల్ వేతనంలో కొంత శాతం ట్యాక్స్ రూపంలో పోతుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.8.1 కోట్లు చేరుతుంది. అంటే పంత్ చేతికి వచ్చే డబ్బు రూ. 18.9 కోట్లన్నమాట.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)