Breaking News

ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'

Published on Thu, 11/21/2024 - 15:42

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. అయితే ఇదెలా పనిచేస్తుంది? ఎలాంటి ఫోన్లలకు సపోర్ట్ చేస్తుందనే మరిన్ని విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ఇది వరకు యూపీఐ లావాదేవీలు చేయాలంటే.. తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి. కానీ ఇప్పుడు అందుబాటులోకి రానున్న యూపీఐ 123 పే.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది.

యూపీఐ 123 పే చెల్లింపులు నాలుగు పద్ధతుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఐవీఆర్ నెంబర్స్, మిస్డ్ కాల్స్, ఓఈఎమ్ ఎంబెడెడ్ యాప్‌లు, సౌండ్-బేస్డ్ టెక్నాలజీ. అంటే యూజర్ తమ లావాదేవీలను ఈ నాలుగు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఇవన్నీ 2025 జనవరి 1 కంటే ముందు అమల్లోకి వచ్చేలా బ్యాంకులకు.. ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.

యూపీఐ 123 పే కస్టమర్‌లు బహుళ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండకూడదు. కస్టమర్ మరొక ఖాతాను జోడించాలనుకుంటే.. వారు తప్పనిసరిగా ప్రస్తుత బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసి, ఆపై మరొక బ్యాంక్ ఖాతాను జోడించాలి.

UPI 123PAYతో బ్యాంక్ ఖాతాను ఎలా లింక్ చేయాలి?
•మొదట ఏదైనా ఐవీఆర్ నెంబర్‌కి కాల్ చేయండి
•కాల్ చేసిన తరువాత మీ భాషను ఎంచుకోండి
•మీ బ్యాంక్ ఖాతాను నమోదు చేయడానికి ఎంచుకోండి
•మీ డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి
•యూపీఐ పిన్ సెట్ చేసుకోండి.
•పై దశలను పాటిస్తే మీ యూపీఐ 123 పేతో బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)