Breaking News

ఐఆర్‌సీటీసీ ఈవ్యాలెట్: బుక్ చేస్తే టికెట్ కన్ఫర్మ్‌ అవ్వాల్సిందే!

Published on Mon, 01/27/2025 - 20:50

సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారిలో చాలామంది ట్రైన్ జర్నీ ఎంచుకుంటారు. దీని కోసం కొందరు ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటారు. మరికొందరు తత్కాల్‌లో బుక్ చేసుకుంటారు. ఎవరెలా బుక్ చేసుకున్నా.. కొన్ని సార్లు చెల్లింపులలో జాప్యం, క్యాన్సిల్ చేయడంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (IRCTC) ఈవ్యాలెట్ (eWallet) తీసుకొచ్చింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇండియన్ రైల్వే.. ప్రయాణికుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన 'ఐఆర్‌సీటీసీ ఈవ్యాలెట్' టికెట్స్ బుక్ చేయడంలో, ఆలస్యంగా బుకింగ్ కన్ఫర్మ్‌, క్యాన్సిల్ వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా టికెట్ కన్ఫర్మ్‌ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతోంది. ఈవ్యాలెట్ ద్వారా చెల్లింపు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి వెంటనే టికెట్స్ బుక్ అవుతాయి. దీనికోసం అదనపు చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

టికెట్ బుక్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. టికెట్ క్యాన్సిల్ చేయడంలో ఎలాంటి ఆలస్యం ఉండదు. రీఫండ్ కూడా నేరుగా వ్యాలెట్‌లోకి వచ్చేస్తుంది. వ్యాలెట్‌ను నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈవ్యాలెట్ లావాదేవీలు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి.

ఐఆర్‌సీటీసీ ఈవ్యాలెట్ ద్వారా టికెట్ బుకింగ్
➤ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసిన తరువాత.. మీ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి లాగిన్ చేయాలి.
➤మొదటిసారిగా eWalletని ఉపయోగిస్తుంటే, IRCTC ఎక్స్‌క్లూజివ్ విభాగానికి వెళ్లి, అక్కడ ఈవ్యాలెట్ సెలక్ట్ చేసుకోవాలి.
➤ఈవ్యాలెట్ సెలక్ట్ చేసుకున్న తరువాత ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
➤ఆ తరువాత ఈవ్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. టాప్అప్ ఆప్షన్ కనిపిస్తుంది.
➤ఇందులో మీరు రూ. 100 నుంచి రూ. 10000 వరకు బ్యాలెన్స్ యాడ్ చేసుకోవచ్చు.
➤ఈ బ్యాలెన్స్ ద్వారానే ట్రైన్ టికెట్స్ సులభంగా బుక్ చేసుకోవచ్చు.
➤పేమెంట్ సమయంలో.. వ్యాలెంట్ నుంచి చాలా వేగంగా కట్ అవుతుంది. తత్కాల్ సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)