Breaking News

గూగుల్ కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌: ఎవరీ ప్రభాకర్ రాఘవన్‌..

Published on Fri, 10/18/2024 - 14:44

గూగుల్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్‌గా 'ప్రభాకర్ రాఘవన్‌' నియమితులైనట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. గత 12 సంవత్సరాలుగా కంపెనీకి సేవలందిస్తున్న రాఘవన్‌.. గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్ వంటి వాటికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఎవరీ ప్రభాకర్ రాఘవన్‌?
భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రభాకర్ రాఘవన్‌ 1981లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత 1982లో శాంటా బార్బరాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. 1986లో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు.

2012లో ప్రభాకర్ రాఘవన్ గూగుల్‌లో చేరారు. అంతకంటే ముందు ఈయన యాహూలో పనిచేశారు. యాహూ నుంచి గూగుల్‌లో చేరిన తరువాత సెర్చ్ అండ్ యాడ్ ర్యాంకింగ్‌తో పాటు యాడ్ మార్కెట్‌ప్లేస్ డిజైన్‌లో పనిచేశారు. ఆ తరువాత గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్​లలోనూ పనిచేసారు. ఈ సమయంలోనే ఈయన స్మార్ట్ రిప్లై అండ్ స్మార్ట్ కంపోజ్ వంటి ఏఐ ఫీచర్స్ ప్రారంభిచడంలో కీలకపాత్ర పోషించారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..

ప్రభాకర్ రాఘవన్‌ వివిధ విభాగాల్లో పనిచేస్తూ 2018లో గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్, పేమెంట్స్ ప్రొడక్ట్‌ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాఘవన్ నాయకత్వంలోనే ఏఐ ఓవర్‌వ్యూస్, సర్కిల్ టు సెర్చ్, లెన్స్‌లో మీరు చూసే వాటిని షాపింగ్ చేయండి వంటి ఫీచర్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పుడు ఈయన గూగుల్ చీఫ్ టెక్నాలజిస్ట్‌గా నియమితులయ్యారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)