Breaking News

తల్లి బాటలో కూతురు.. వేలకోట్లకు వారసురాలు!

Published on Sun, 01/05/2025 - 11:08

భారతదేశంలో అత్యంత సంపన్నులైన వ్యాపారవేత్తల జాబితాలో 'లీనా తివారీ' ఒకరు. బహుశా ఈ పేరు కొంతమందికి పరిచయమే అయినా.. ఈమె కుమార్తె 'అనీషా గాంధీ తివారీ' (Aneesha Gandhi Tewari) గురించి బహుశా తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆమె గురించి తెలుసుకుందాం.

అనీషా గాంధీ బ్రౌన్ యూనివర్శిటీ నుంచి బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి మాలిక్యులర్ బయాలజీలో పీహెచ్‌డీ(PhD) పట్టా పొందారు. చదువు పూర్తయిన తరువాత అనీషా యూఎస్‌వీ బోర్డ్‌కు డైరెక్టర్‌లలో ఒకరుగా చేరారు.

యూఎస్‌వీ (USV) అనేది పార్మాస్యుటికల్ కంపెనీ. దీనిని లీనా తివారీ తన తండ్రి 'విఠల్ గాంధీ' 1961లో రెవ్లాన్ సహకారంతో ప్రారంభించారు. ఇది లీనా సారథ్యంలో గణనీయమైన వృద్ధి సాధించింది. నేడు, ఈ కంపెనీ కార్డియోవాస్కులర్, డయాబెటిక్ ఔషధాల విభాగంలో భారతదేశంలోని మొదటి ఐదు సంస్థలలో ఒకటిగా నిలిచింది.

లీనా తివారీ
ముంబై యూనివర్సిటిలో గ్రాడ్యుయేట్, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన 'లీనా తివారీ' USV ఇండియాకు నాయకత్వం వహిస్తున్నారు. ఈమె రూ. 11వేలకోట్ల కంటే ఎక్కువ నికర విలువతో.. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరుగా నిలిచారు. ఈమె అనేక దాతృత్వ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ఇందులో భాగంగానే వెనుకబడిన మహిళలకు సాధికారత కల్పించే విద్యా కార్యక్రమాలపై దృష్టి సారించారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)