Breaking News

డిక్సన్‌ టెక్నాలజీస్‌లో వాటా విక్రయం

Published on Tue, 06/24/2025 - 10:14

ఎల్రక్టానిక్స్‌ కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ దిగ్గజం డిక్సన్‌ టెక్నాలజీస్‌(ఇండియా) ప్రమోటర్‌ సునీల్‌ వాచని కంపెనీలో 2.77 శాతం వాటా విక్రయించారు. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 13,301.47 సగటు ధరలో 16.7 లక్షల షేర్లను అమ్మివేశారు. తద్వారా రూ. 2,221 కోట్లకుపైగా అందుకున్నారు. బీఎస్‌ఈ బల్క్‌ డీల్‌ గణాంకాల ప్రకారం కంపెనీ చైర్‌పర్శన్‌ సునీల్‌ వాటా దీంతో డిక్సన్‌లో 5.34 శాతం నుంచి 2.57 శాతానికి క్షీణించింది. మొత్తం ప్రమోటర్ల వాటా 32.27 శాతం నుంచి 29.5 శాతానికి దిగివచ్చింది.

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎంఎఫ్‌ రెండు దశలలో 2.39 శాతం వాటాకు సమానమైన 14.45 లక్షల డిక్సన్‌ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 13,308 సగటు ధరలో ఇందుకు రూ. 1,924 కోట్లు వెచ్చించింది. ఈ లావాదేవీ తదుపరి డిక్సన్‌ టెక్నాలజీస్‌లో మోతీలాల్‌ ఎంఎఫ్‌ వాటా 2.24 శాతం నుంచి 4.63 శాతానికి ఎగసింది. ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ నికర లాభం రూ. 97 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..

ఇందుకు కన్సాలిడేటెడ్‌ ఆదాయం రెట్టింపునకుపైగా జంప్‌చేసి రూ. 10,293 కోట్లకు చేరడం సహకరించింది. 2023–24లో రూ. 4,658 కోట్ల ఆదాయం మాత్రమే సాధించింది. పూర్తి ఏడాదికి(2024–25) ఆదాయం రూ. 17,691 కోట్ల నుంచి రూ. 38,860 కోట్లకు బలపడగా.. కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ. 375 కోట్ల నుంచి రూ. 1,233 కోట్లకు ఎగసింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)