Breaking News

స్విగ్గీకి రూ.35,453 జరిమానా!

Published on Mon, 11/04/2024 - 13:18

ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.35,453 జరిమానా విధించింది. డెలివరీ దూరాలను పెంచి, కస్టమర్ల నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేసినట్లు కన్జూమర్‌ కోర్టు తెలిపింది. స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కొనుగోలుదారులకు కొంత దూరం వరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా డెలివరీ అందించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా ఓ కస్టమర్‌ నుంచి డెలివరీ ఛార్జీలు వసూలు చేసినట్లు కోర్టు పేర్కొంది.

‘హైదరాబాద్‌కు చెందిన సురేష్‌బాబు అనే కస్టమర్‌ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కొనుగోలు చేశాడు. కొంత దూరం లోపు ఉచితంగా డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. నవంబర్ 1, 2023న అతను ఈ మెంబర్‌షిప్‌ కార్డును వినియోగించి ఫుడ్‌ ఆర్డర్ చేశాడు. నిబంధనల ప్రకారం స్విగ్గీ నిర్దిష్ట పరిధిలో ఉన్న కస్టమర్లకు ఉచితంగా డెలివరీ అందించాలి. సురేష్‌ ఆర్డర్‌ చేసిన డెలివరీ పరిధి కంపెనీ నిబంధనలకు లోబడి ఉంది. కానీ డెలివరీ దూరం 9.7 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్లకు సంస్థ పెంచిందని, దీని వల్ల రూ.103 అదనంగా డెలివరీ ఛార్జీ చెల్లించాడు’ అని కమిషన్‌ తెలిపింది.

ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..

సురేష్‌ అందించిన గూగుల్ మ్యాప్స్ స్క్రీన్‌షాట్‌లతో సహా ఇతర సాక్ష్యాలను కోర్టు సమీక్షించింది. డెలివరీ దూరంలో గణనీయమైన మార్పును గుర్తించింది. ఈ అంశంపై స్విగ్గీ విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం. రూ.103 డెలివరీ ఛార్జీతో పాటు ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి 9 శాతం వడ్డీతో రూ.350.48ని తిరిగి చెల్లించాలని కమిషన్ తన తీర్పులో స్విగ్గీని ఆదేశించింది. కస్టమర్‌ అసౌకర్యానికి సంబంధించి రూ.5,000 చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చుల కింద మరో రూ.5,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అదనంగా రూ.25,000 నష్టపరిహారాన్ని రంగారెడ్డి జిల్లా కమిషన్ వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలను పాటించేందుకు కంపెనీకి 45 రోజుల గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)