Breaking News

గూగుల్ బాటలో డిస్కార్డ్.. మళ్ళీ 170 మంది

Published on Fri, 01/12/2024 - 13:15

2023లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కున్న ఉద్యోగులకు.. 2024 కూడా కలిసి రాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలో కూడా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం మొదలెట్టేశాయి. ఈ వరుసలో తాజాగా ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'డిస్కార్డ్' (Discord) చేరింది.

డిస్కార్డ్ కంపెనీ 2023 ఆగష్టులో 40 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత.. 2024లో తమ ఎంప్లాయిస్‌ను తొలగించడం ఇదే మొదటి సారి. ఇప్పడూ కంపెనీ 170 మంది (17 శాతం) ఉద్యోగులను తీసివేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 700 మందికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

డిస్కార్డ్ సీఈఓ జాసన్ సిట్రాన్ ప్రకారం.. 2020లో నియామకాలు పెరిగిన తరువాత కరోనా ప్రభావం వల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఉందని భావించినట్లు.. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. ఊహకందని రీతిలో పెరిగిన బంగారం ధరలు 

గూగుల్ & అమెజాన్ కూడా..
2024 ప్రారంభంలో కేవలం డిస్కార్డ్ కంపెనీ మాత్రమే కాకుండా అమెజాన్, గూగుల్ కంపెనీలు కూడా ఇప్పటికే ఉద్యోగులను తొలగించాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని గూగుల్ ఇంటికి పంపింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)