Breaking News

పెళ్లి ఘనంగా.. రిజిస్ట్రేషన్‌ డిజిటల్‌గా..

Published on Fri, 10/24/2025 - 12:11

ప్రస్తుతం మనమంతా డిజిటల్‌ యుగంలో జీవిస్తున్నాం. ఇప్పటికే దాదాపు చెల్లింపులన్నీ డిజిటల్‌గానే జరుగుతున్నాయి. డిజిటలైజేషన్‌ ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పౌరసేవకు విస్తరిస్తోంది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సైతం డిజిటలైజేషన్‌ను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో వివాహ రిజిస్ట్రేషన్‌ డిజిటల్‌గా నిర్వహించడం ఇప్పుడు సరికొత్త అధ్యాయానికి తెర తీసింది.

ఏమిటీ డిజిటల్‌ మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌?

సాధారణంగా వివాహ రిజిస్ట్రేషన్‌ అంటే పెళ్లి జరిగిన తర్వాత వధూవరులతో పాటు ఇరువైపులా సాక్షుల సంతాలతో పలు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం రోజులకొద్దీ సమయం పడుతుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.

ఈ తతంగాన్ని సరళీకరిస్తూ డాక్యుమెంట్ల అవసరం లేకుండా పెళ్లి వేదిక వద్ద నుంచే డిజిటల్‌ కేవైసీ వెరిఫికేషన్‌ ద్వారా చేసేదే డిజిటల్‌ వివాహ రిజిస్ట్రేషన్‌. పెళ్లి జరిగే స్థానిక మున్సిపాలిటీలు లేదా గ్రామ పంచాయతీలను సమన్వయం చేసుకుంటూ అధికారులు ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. డిజిటల్‌ సంతకం కూడిన మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేస్తారు.

కేరళలో శ్రీకారం

వివాహ రిజిస్ట్రేషన్‌ డిజిటల్‌గా నిర్వహించి వార్తల్లో నిలిచింది కేరళ. కవస్సేరీ గ్రామ పంచాయతీలో లావణ్య, విష్టు అనే వధూవరులు వీడియో డిజిటల్‌ కేవైసీ ద్వారా తమ వివాహాన్ని రిజిష్టర్‌ చేసుకున్నారు. అదే రోజున డిజిటల్‌ ధ్రువీకరణతో మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ అందుకున్నారు.

కేరళ ప్రభుత్వ అనేక పౌర సేవలను డిజిటల్‌ విధానంలో అందిస్తోంది. ఇందు ​​కోసం ‘కె-స్మార్ట్‌ గవర్నెన్స్‌’ అనే ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడమే ఈ చొరవ లక్ష్యం.

జాతీయస్థాయిలోనూ ప్రయత్నాలు

పౌర సేవలను డిజిటలైజేషన్‌ చేసేందుకు జాతీయస్థాయిలోనూ విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక రాష్ట్రాలు డిజిటల్‌ చొరవతో ముందుకు వెళ్తున్నాయి. ఈ దిశగా మహారాష్ట్రలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రూ.62 కోట్ల నిధులు కేటాయించి భూములు, వివాహాల రికార్డులను డిజిటలైజ్‌ చేస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)