డిజిటల్‌ లోన్‌ గురించి తెలుసా? ఈ డాక్యుమెంట్లుంటే సులువుగా రుణం!

Published on Fri, 08/04/2023 - 20:28

పర్సనల్‌ లోన్‌ కావాలంటే బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల చుట్టూ తిరగాలి. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే అధికారులు ఆమోదించి లోన్‌ మంజూరు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో లేదా యాప్‌లో లభించే వ్యక్తిగత రుణాన్ని  డిజిటల్ లోన్ అంటారు. దీన్నే ఆన్‌లైన్ పర్సనల్ లోన్ అని కూడా పిలుస్తారు. సాధారణ పర్సనల్‌ లోన్‌తో పోలిస్తే డిజిటల్‌ లోన్ చాలా తక్కువ సమయంలో మంజూరవుతుంది. అయితే  డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతం అయినప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అందువల్ల సరైన డాక్యుమెంటేషన్ ఇక్కడ కీలకం.

బ్యాంకు ఉ‍ద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు!

అర్హత
సాధారణ పర్సనల్‌ లోన్‌ పొందడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ పర్సనల్‌ లోన్‌కి కూడా అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కనీస ఆదాయం లేదా టర్నోవర్ కలిగిన స్వయం ఉపాధి పొందుతున్నవారు ఈ లోన్‌ పొందవచ్చు. ఆన్‌లైన్ పర్సనల్ లోన్‌కు అర్హత దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అందుబాటులో లేనప్పుడు ఆ వ్యక్తి సమర్పించే అదనపు డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారుల వయస్సు, ఉపాధి, వృత్తిపరమైన అనుభవం వంటి సమాచారం కూడా అవసరమవుతుంది. 

డాక్యుమెంట్లు
అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచడం వలన అనవసరమైన జాప్యాలు, తిరస్కరణలు, అభ్యర్థనలు లేకుండా లోన్‌ అప్రూవల్‌ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. డిజిటల్ లోన్ దరఖాస్తు ప్రక్రియ సాఫీగా జరగడానికి అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు ఏవో ఇక్కడ ఇస్తున్నాం..

ఐడెంటిటీ ప్రూఫ్‌
లోన్‌ కోసం దరఖాస్తు చేసినప్పుడు, రుణగ్రహీతలు తమ గుర్తింపును నిర్ధారించేందుకు 
చెల్లుబాటు అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్‌ను అందించాలి. వీటిలో ముఖ్యమైనవి పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్.

అడ్రెస్‌ ప్రూఫ్‌
లోన్‌ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి ఐడెంటిటీ ప్రూఫ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే అడ్రెస్‌ ప్రూఫ్‌ కూడా అవసరం. పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటివి కొన్ని చెల్లుబాటు అయ్యే అడ్రెస్‌ ప్రూఫ్‌లు.

ఇన్‌కమ్‌ ప్రూఫ్‌
రుణగ్రహీతలు తమ ఆదాయాన్ని చూపించే ఏదైనా డాక్యుమెంట్‌ను కలిగి ఉండాలి. ఇందు కోసం లేటెస్ట్‌ శాలరీ స్లిప్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటివి సమర్పించవచ్చు. ఈ డాక్యుమెంట్లు దరఖాస్తుదారు ఆర్థిక స్థిరత్వాన్ని, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తాయి. 

సంతకం ప్రూఫ్‌
దరఖాస్తుదారు, రుణ సంస్థ మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని రూపొందించడానికి ఈ-సైన్ అని పిలిచే డిజిటల్ సంతకం అవసరం. ఇది పరస్పర అంగీకారం, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)