సంపద వృద్ధికి పలు మార్గాలు

Published on Mon, 11/23/2026 - 09:21

సంపదను పెంచుకోవాలనుకున్నప్పుడు సుదీర్ఘమైన పెట్టుబడుల ప్రస్థానంలో, మారిపోయే మార్కెట్‌ పరిస్థితులకు అనువైన పెట్టుబడి విధానాన్ని కొనసాగిస్తూ, వృద్ధిని ఎలా సాధించాలనేది ఒక కీలక ప్రశ్నగా ఉంటుంది. మల్టీ అసెట్‌ ఫండ్స్‌ రూపంలో దీనికి సమాధానం లభిస్తుంది. ఇవి వివిధ సాధనాలను ఒకే పోర్ట్‌ఫోలియోలో అందించడం, అంతర్గతంగానే కేటాయింపులను సర్దుబాటు చేస్తుండటం ద్వారా మెరుగైన రాబడులు అందుకునే విధానాన్ని ఇన్వెస్టర్లకు అందిస్తాయి. ఈ నేపథ్యంలోనే వీటికి ఇన్వెస్టర్లలో ఆదరణ పెరుగుతోంది.

ఇవి ఎలా ఇన్వెస్ట్‌ చేస్తాయంటే..
మల్టీ అసెట్‌ ఫండ్స్‌ అనేవి ఒకే పోర్ట్‌ఫోలియోలో అంతర్గతంగా మూడు రకాల సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీసం మూడు అసెట్‌ క్లాస్‌లకు తలో 10 శాతం చొప్పున అయినా కేటాయించాల్సి ఉంటోంది. ఫండ్‌ వ్యూహాన్ని బట్టి, ఈక్విటీ, ఫిక్స్‌డ్‌ ఇన్‌కం, బంగారంలాంటి కమోడిటీల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఈ ఫండ్‌లు నిపుణుల నిర్వహణలో ఉంటాయి కాబట్టి ఇన్వెస్టర్లు స్వయంగా వివిధ రకాల సాధనాలతో పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవాల్సిన భారం ఉండదు.

ప్రయోజనాలు ఏంటంటే..
మల్టీ అసెట్‌ ఫండ్స్‌తో ఇన్వెస్టర్లకు పలు ప్రయోజనాలు ఉంటాయి. బహుళ సాధనాలతో మెరుగైన రాబడులు: వివిధ దశల్లో పోర్ట్‌ఫోలియో రాణించేందుకు వివిధ సాధనాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి, మార్కెట్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా పెట్టుబడులను కొనసాగించేందుకు వీలుగా ఉంటుంది.

ప్రొఫెషనల్‌గా కేటాయింపులు: సొంతంగా పోర్ట్‌ఫోలియో తయారు చేసుకుంటే ఏ అసెట్‌కి ఎంత కేటాయించాలనేది సవాలుగానే ఉంటుంది. ముఖ్యంగా మార్కెట్లో పరిస్థితులు మారినప్పుడు ఇది మరింత సంక్లిష్టంగా ఉంటుంది. అదే మల్టీ అసెట్‌ ఫండ్‌లోనైతే ఫండ్‌ లక్ష్యానికి అనుగుణంగా ఫండ్‌ మేనేజరే కేటాయింపులను పర్యవేక్షిస్తారు. దీనితో ఇన్వెస్టర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.

ఎప్పటికప్పుడు సర్దుబాట్లు: మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్లుగా పోర్ట్‌ఫోలియోని అసెట్‌లకు కేటాయింపులు మారుతూ ఉంటాయి. ఇన్వెస్టర్లు పదే పదే జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫండ్‌ మేనేజరే ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తారు.

సౌలభ్యం: వివిధ సాధనాలను ఎంచుకోవడం, ఒక్కో పెట్టుబడిని పర్యవేక్షించుకోవడం, రీబ్యాలెన్స్‌ చేసుకుంటూ ఉండాల్సిన బాదరబందీ లేకుండా ఒకే ఫండ్‌ ద్వారా పలు ప్రయోజనాలను ఇన్వెస్టరు పొందవచ్చు. ప్రతిదీ తామే స్వయంగా చూసుకోవాల్సిన అవసరం లేకుండా విస్తృత పోర్ట్‌ఫోలియో కలిగి ఉండాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ వ్యూహం ఎంతో అనువైనదిగా ఉంటుంది.

మార్కెట్‌ గత చరిత్రను గమనించినప్పుడు మల్టీ–అసెట్‌ విధానం ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత మరింత స్పష్టంగా అర్థమవుతుంది. గడిచిన 17 సంవత్సరాలలో వివిధ రకాల అసెట్‌ క్లాస్‌ల పనితీరు గణనీయంగా మారుతూ వచ్చింది. ఏ ఒక్క నిర్దిష్ట అసెట్‌ క్లాస్‌ కూడా నిరంతరం అగ్రస్థానంలో నిలవలేదు. భారతీయ ఈక్విటీలు, అమెరికా ఈక్విటీలు, బాండ్లు, పసిడి, వెండి అలాగే చైనా ఈక్విటీలు.. ఇలా ప్రతీదీ వేర్వేరు సమయాల్లో అత్యుత్తమ రాబడులను అందించాయి.

ఒకటి తగ్గినప్పుడు మరొకటి పుంజుకోవడం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ముందుగానే ఏ అసెట్‌ క్లాస్‌ అత్యుత్తమ రాబడులను ఇస్తుందో కచ్చితంగా అంచనా వేయడం ఇన్వెస్టర్లకు ఎంతో కష్టమనే వాస్తవాన్ని ఇది స్పష్టం చేస్తోంది. మల్టీ–అసెట్‌ ఫండ్స్‌ ఈ సవాలుకు చక్కటి పరిష్కారమార్గంగా ఉంటాయి.

ఇవి ఒకే పోర్ట్‌ఫోలియో పరిధిలోనే విభిన్నమైన సాధనాల్లో (ఈక్విటీ, పసిడి, బాండ్లు మొదలైనవి) పెట్టుబడులను నిర్వహిస్తాయి. దీనివల్ల కేవలం ఒకే రకమైన పెట్టుబడిపై ఆధారపడకుండా, మార్కెట్‌ వలయంలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు రకాల విభాగాలు మెరుగైన రాబడులను అందించడానికి వీలవుతుంది. అదనంగా, అంతర్జాతీయ అసెట్స్‌లోనూ పెట్టుబడులు పెడితే పోర్ట్‌ఫోలియోకి మరింత వైవిధ్యాన్ని లభిస్తుంది. అలాగే కాలక్రమేణా రూపాయి క్షీణత నుండి కూడా సానుకూల ప్రయోజనాన్ని పొందే అవకాశం కలుగుతుంది.

ఎవరికి అనువైనవి..
ఒకే పెట్టుబడి సాధనం ద్వారా విభిన్న అసెట్‌ క్లాస్‌లలో పెట్టుబడి పెడుతూ, దీర్ఘకాలిక రాబడులను సాధించాలనుకునే ఇన్వెస్టర్లకు మల్టీ అసెట్‌ ఫండ్లు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి ఈక్విటీలతో పాటు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ (బాండ్లు) మరియు బంగారం వంటి విభాగాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, సొంతంగా వివిధ రకాల పెట్టుబడులను పర్యవేక్షించడం మరియు రీబ్యాలెన్సింగ్‌ చేయడం ఇష్టం లేని వారికి ఇవి చక్కగా సరిపోతాయి. నిపుణులైన ఫండ్‌ మేనేజర్ల ద్వారా తమ అసెట్‌ అలొకేషన్‌ను సురక్షితంగా నిర్వహించుకోవాలనుకునే వారికి, అలాగే దీర్ఘకాలిక వ్యవధిలో వేర్వేరు అసెట్‌ క్లాస్‌లు అందించే ప్రయోజనాలను పొందాలనుకునే ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవిగా ఉంటాయి.

చివరిగా గుర్తుంచుకోవాల్సినదేమిటంటే.. 
సంపదను పెంచుకోవడమనేది ఓ సుదీర్ఘ ప్రయాణం. ఈ క్రమంలో పెట్టుబడుల వాతావరణం మారుతుంటుంది. అలాంటప్పుడు మల్టీ అసెట్‌ ఫండ్స్‌ అనేవి వివిధ అసెట్స్‌లో పెట్టుబడుల ప్రయోజనాలను ఒకే ఫండ్‌ ద్వారా పొందే వీలు కల్పిస్తాయి. నిపుణుల నిర్వహణలో ఉండే పోర్ట్‌ఫోలియో ద్వారా ఇన్వెస్టర్లకు మరింత మెరుగైన రాబడులు అందించగలిగే సాధనాలు అందుబాటులో ఉంటాయి. ఇదొక్కటే వీటి ఆకర్షణకు కారణం కాదు. వృద్ధి అవకాశాలు, నిపుణుల నిర్వహణ, సౌలభ్యం, ఇలా అన్నీ ఒకే ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా అందించగలిగేలా ఉండటమే దీని ప్రత్యేకత. వృద్ధి సాధనకు ఒకే మార్గంపై ఆధారపడకుండా, మరిన్ని మార్గాలను ఉపయోగించుకునేలా పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవడం లక్ష్యంగా ఉండాలి.

ఇదీ చదవండి: తాగునీటిలో బ్రోమేట్.. కుకీస్‌లో నిషేధిత రంగులు!

#

Tags : 1

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)