Breaking News

హాస్టల్, కో-లివింగ్‌ మధ్య తేడాలివే!

Published on Sat, 11/29/2025 - 17:00

సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులు, ఉద్యోగులు, ప్రవాసులు ఎవరైనా సరే వేరే నగరానికి వెళ్తే ముందుగా వెతికేది, ఉండేందుకు మంచి వసతి ఎక్కడుందనే! అందుబాటు ధరల్లో ఎక్కడ దొరకుతాయని ఎంత మంది వెతుకుతారో.. అంతకు రెట్టింపు జనాలు అద్దె కాస్త ఎక్కువైనా పర్వాలేదు అంతర్జాతీయ వసతులతో కూడిన అపార్ట్‌మెంట్ల కోసం శోధిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే డెవలపర్లు కో–లివింగ్‌ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు.

హాస్టల్స్‌ – కో లివింగ్‌ మధ్య తేడా ఏంటంటే..
సాధారణంగా మనం చూసే హాస్టల్స్‌లో ఒకే రూమ్‌లు రెండు, మూడు బెడ్స్‌ను వేసి వాటిని అద్దెకు ఇస్తుంటారు. భోజన ఏర్పాట్లు హాస్టల్స్‌ నిర్వాహకులే చూసుకుంటారు. ఒకవేళ భార్య భర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఒకటే హాస్టల్‌లో ఉండటం కుదరదు. మగవాళ్లకు, ఆడ వాళ్లకు వేర్వేరుగా వసతి గృహాలుంటాయి. అదే కో లివింగ్‌లో అయితే ఎవరైనా ఉండొచ్చు. సాధారణ హాస్టల్స్‌ మాదిరిగానే కో లివింగ్‌లో కూడా బెడ్‌కు ఇంతని ధర ఉంటుంది. గంట, రోజులు, నెల, సంవత్సరాల వారీగా గదులను అద్దెకు తీసుకోవచ్చు. నేటి యువతరం జీవన శైలికి అవసరమైన అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. కాబట్టి వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి.

సాధారణ ప్రజలూ వినియోగం..
కో లివింగ్‌ ప్రాజెక్ట్‌లలో స్విమ్మింగ్‌ పూల్, జిమ్, రెస్టారెంట్లు, బార్, సెలూన్, స్పా, యాంపి థియేటర్‌ వంటి అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తారు. ఆఫీస్‌ పని చేసుకునేందుకు వీలుగా 24 గంటలు హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటుంది. మహిళల భద్రత, రక్షణ నిమిత్తం సీసీ కెమెరాలు, సాంకేతిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.

విశాలమైన పార్కింగ్, అందులో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్లు ఉంటాయి. 24 గంటలు వైద్య సదుపాయాలు, ఫార్మసీ అందుబాటులో ఉంటాయి. ప్రతీరోజూ కల్చరల్, మోటివేషన్‌ కార్యక్రమాలుంటాయి. వారాంతాల్లో నైట్‌ బజార్, ఫుడ్‌ ఫెస్టివల్స్‌ ఉంటాయి. వీటిని కోలివింగ్‌ నివాసితులతో పాటు సాధారణ ప్రజలు కూడా వినియోగించుకోవచ్చు.

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)