Breaking News

డీజిల్‌ అమ్మకాల్లో అదే ధోరణి

Published on Tue, 10/03/2023 - 04:46

న్యూఢిల్లీ: డీజిల్‌ అమ్మకాల్లో క్షీణత కొనసాగుతూనే ఉంది. సెపె్టంబర్‌ నెలలోనూ 3% తక్కువగా విక్రయాలు నమోదయ్యాయి. ఆగస్ట్‌లోనూ డీజిల్‌ అమ్మకాలు 3.2% తగ్గడం గమనించొచ్చు. ఏటా జూన్‌ నుంచి మొదలయ్యే నాలుగు నెలల వర్షాకాల సీజన్‌లో డీజిల్‌ అమ్మకాలు తక్కువగా నమోదవుతుంటాయి. ఇక పెట్రోల్‌ విక్రయాలు 5.4% పెరిగాయి. ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కె టింగ్‌ కంపెనీలు హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్‌ ఉమ్మడి గణాంకాలు ప్రతి నెలా విడుదల అవుతుంటాయి.

వీటి ప్రకారం సెపె్టంబర్‌లో డీజిల్‌ అమ్మకాలు 5.81 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో 5.99 మిలియన్‌ టన్నుల మేర అమ్మకాలు ఉండడం గమనార్హం. ముఖ్యంగా సెపె్టంబర్‌ నెలలో మొదటి 15 రోజుల్లో డీజిల్‌ అమ్మకాలు 5 శాతం తగ్గగా, తర్వాతి 15 రోజుల్లో వర్షాలు లేకపోవడంతో పుంజుకున్నాయి. ఇక ఆగస్ట్‌ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డీజిల్‌ అమ్మకాలు 2.5 శాతం పెరిగాయి.

ఆగస్ట్‌ నెలలో డీజిల్‌ విక్రయాలు 5.67 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్‌ అమ్మకాలు పెరిగాయి. జూన్‌ నుంచి తగ్గుతూ వస్తున్నాయి.  పెట్రోల్‌ విక్రయాలు సెప్టెంబర్‌ నెలలో 2.8 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 5.4 శాతం వృద్ధి కనిపించింది. ఆగస్ట్‌ నెలలో మాత్రం పెట్రోల్‌ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)