Breaking News

గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?

Published on Mon, 03/10/2025 - 20:54

నిర్దిష్ట ఆదాయం కంటే ఎక్కువ సంపాదన ఉన్నప్పుడు.. మన దేశంలో ట్యాక్స్ చెల్లించాలి. పాత ఆదాయపు పన్ను విధానం ప్రకారం.. ట్యాక్స్ రిబేట్ రూ. 5 లక్షలుగా ఉండేది. కొత్త పన్ను విధానం ప్రకారం ఇది రూ. 12 లక్షలకు చేరింది. ఆదాయపన్ను చట్టం 1961 కింద.. కొత్త, పాత పన్ను విధానాల కింద ఏది ఎంచుకుంటే.. ఆ శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి.

పన్ను మినహాయింపు పరిమితి దాటితే.. ఐటీఆర్ ఫైల్ చేయాలి. కొందరు దీనిని పెడచెవిన పెడుతున్నారు. అంటే ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. అలాంటి వారిని ఇప్పుడు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే ట్యాక్స్ కట్టకుండా ఉన్నవారి లిస్ట్ కూడా తయారు చేసుకుంది. సదరు వ్యక్తులకు నోటీసులు కూడా అందుతాయి.

ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారో.. వారిపైన సెక్షన్ 148ఏ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు లిస్ట్ చేసిన వారు 2018-19, 2019-20, 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ చెల్లించకుండా ఉన్నవారు అని తెలుస్తోంది. ఇప్పటికే కొందరికి నోటీసులు పంపినట్లు చెబుతున్నారు.

పన్ను కట్టకుండా తప్పించుకునే వారిని గుర్తించడానికి ఏఐఎస్, టీడీఎస్/టీసీఎస్ స్టేట్‌మెంట్స్, ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్ స్టేట్‌మెంట్‌ వంటి వాటిని ఆదాయపన్ను శాఖ తనిఖీ చేస్తుంది. వీటి ద్వారానే ఎవరు పన్ను కడుతున్నారు, ఎవరు కట్టడం లేదనే విషయాలను తెలుసుకుంటుంది. పన్ను ఎగ్గొట్టే వారిని గుర్తించి.. వారికి నోటీసులు జారీ చేస్తుంది.

ఇదీ చదవండి: రన్యా రావు కేసు.. దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చంటే?

ఎవరైతే పన్ను చెల్లించకుండా.. తప్పించుకుంటున్నారో వారికి నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కండొనేషన్ ఆఫ్ డిలేకు అప్లై చేసుకుని లేదా వడ్డీతో కలిపి ట్యాక్స్ పూర్తిగా చెల్లించినట్లయితే.. బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)