Breaking News

ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ స్టేటస్‌

Published on Mon, 09/09/2024 - 10:08

డిపాజిట్‌దార్లు ఆన్‌లైన్‌లో తమ క్లెయిమ్‌ స్టేటస్‌ను తెలుసుకునేలా డీఐసీజీసీ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) ఆన్‌లైన్‌ టూల్‌ ‘దావా సూచక్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఖాతాదారులు తమ డిపాజిట్ల క్లెయిమ్‌ పరిస్థితిని తెలుసుకోవచ్చు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకే ఈ ‘దావా సూచక్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీఐసీజీసీ తెలిపింది.

బ్యాంక్‌లో నమోదైన మొబైల్‌ నంబరు ద్వారా ఖాతాదారులు దావా సూచక్‌లోని సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అయితే 2024 ఏప్రిల్‌ 1 తర్వాత చేసిన క్లెయిమ్‌ల వివరాలు మాత్రమే ఈ టూల్‌ ద్వారా తెలుసుకునేందుకు వీలుందని డీఐసీజీసీ పేర్కొంది. సంస్థలు(ఇన్‌స్టిట్యూషన్స్‌) చేసే డిపాజిట్లు మినహా ఇతర అన్నిరకాల క్లెయిమ్‌లను ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం ఉంది. అంటే ఉదాహరణకు ఏదైనా బ్యాంకులోగానీ, ఎన్‌బీఎఫ్‌సీలోగానీ రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ చేస్తే ఆ డబ్బుకు బీమా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల బ్యాంక్‌ డీఫాల్ట్‌ అయితే రూ.5 లక్షలకంటే ఎక్కువ డిపాజిట్‌ చేసినా రూ.5 లక్షలు మాత్రం కచ్చితంగా చెల్లిస్తారు.

ఇదీ చదవండి: పెరిగిన ట్రక్‌ అద్దెలు

దేశంలోని మొత్తం డిపాజిట్లలో 97.8 శాతం ఖాతాలు పూర్తిగా బీమా పరిధిలో ఉన్నాయని డీఐసీజీసీ తెలిపింది. అంటే ఈ మొత్తాలు రూ.5 లక్షల వరకే ఉన్నవి. మరో 2.2 శాతం రూ.5 లక్షలకు మించిన డిపాజిట్లు. వీటిల్లో ఎంత మొత్తం ఉన్నా రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. 1962లో ఈ బీమా రూ.1,500గా ఉండేది. దాన్ని ఫిబ్రవరి 04, 2020 వరకు ఆరుసార్లు సవరించి రూ.5 లక్షలకు పెంచారు. 2023లో డీఐసీజీసీ రూ.1,432 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)