Breaking News

రియల్టీ ప్లాట్‌ఫామ్‌లో ధోని పెట్టుబడులు

Published on Wed, 03/05/2025 - 14:04

ప్రముఖ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఫ్యామిలీ ఆఫీసు నుంచి వ్యూహాత్మక పెట్టుబడులు అందుకున్నట్లు రియల్టీ సర్వీసుల ప్లాట్‌ఫామ్‌ ఎస్‌ఐఎల్‌ఏ(సిలా) తాజాగా పేర్కొంది. అయితే ఏమేరకు పెట్టుబడి పెట్టారో మాత్రం వివరాలు వెల్లడించలేదు. 2010లో రుషభ్, సాహిల్‌ వోరా ఏర్పాటు చేసిన సిలా దేశవ్యాప్తంగా రియల్టీ అడ్వయిజరీ సర్వీసులు అందిస్తోంది. సంస్థలో నార్వెస్ట్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌కు సైతం పెట్టుబడులున్నాయి. దేశీయంగా 20 కోట్ల చదరపు అడుగుల రియల్టీ ఆస్తులను నిర్వహిస్తున్న కంపెనీలో 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..

కెప్టెన్‌కూల్‌గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికే వివిధ పరిశ్రమల్లో అనేక వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు. ఆయన ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీల జాబితా కింది విధంగా ఉంది.

బ్లూస్మార్ట్ మొబిలిటీ: గురుగ్రామ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ ఆధారిత కంపెనీ టెక్నాలజీ సర్వీసులు అందిస్తూ స్థిరమైన రవాణాపై దృష్టి సారించింది.

గరుడ ఏరోస్పేస్: వ్యవసాయం, రక్షణ, పారిశ్రామిక డ్రోన్లలో ప్రత్యేకత కలిగిన చెన్నైకి చెందిన డ్రోన్ టెక్నాలజీ సంస్థ.

ఈమోటోరాడ్‌: ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్ట్‌ సొల్యూషన్స్‌ను ప్రోత్సహించే ఎలక్ట్రిక్ సైకిల్ స్టార్టప్.

హోమ్ లేన్: బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైన్ అండ్ హోమ్ డెకోర్ కంపెనీ.

ఖాతాబుక్: డిజిటల్ పేమెంట్స్, బుక్ కీపింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌.

కార్స్‌24: పాత కార్లను కొనడానికి, విక్రయించడానికి ఆన్‌లైన్‌ సేవలందించే ప్లాట్‌ఫామ్‌.

షాకా హ్యారీ: ముంబైకి చెందిన మొక్కల ఆధారిత ఆహార సంస్థ.

7ఇంక్ బ్రూస్: ఫుడ్ అండ్ బెవరేజ్ బ్రాండ్.

తగ్‌డా రహో: ఫిట్‌నెస్‌ అండ్ వెల్‌నెస్‌ బ్రాండ్.

రిగి: సోషల్, కంటెంట్ మానిటైజేషన్ ప్లాట్‌ఫామ్‌.
 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)