మోహన్ లాల్ గ్యారేజిలో ధీరూభాయ్ అంబానీ కారు

Published on Sat, 04/29/2023 - 14:01

ప్రముఖ మలయాళీ నటుడు 'మోహన్ లాల్' గురించి దాదాపు అందరికి తెలుసు. తనదైన నటనతో ప్రేక్షలకులను ఆకట్టుకున్న ఈయన తెలుగు ప్రేక్షలకులకు కూడా సుపరిచయమే. మోహన్ లాల్ ఇతర సెలబ్రిటీల మాదిరిగానే ఎప్పటికప్పుడు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే అతని గ్యారేజిలో చాలా కార్లు ఉన్నాయి. ఇందులో ధీరూభాయ్ అంబానీకి చెందిన పాతకాలపు కాడిలాక్ కారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మోహన్ లాల్ గ్యారేజిలో ఎన్ని కార్లు ఉన్నప్పటికీ హిందూస్తాన్ అంబాసిడర్, కాండిలాక్ కార్లు చాలా ప్రత్యేకం. eisk007 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడైన ఫొటోలో ఈ పాతకాలపు కారుని చూడవచ్చు. ఆ కారు పక్కన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ బాలాజీ ఉండటం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనిని బాలాజీ కొనుగోలు చేసినట్లు చెబుతారు. ఆయన స్వయానా మోహన్ లాల్ మామగారు. ఆయన నిర్మించిన చాలా సినిమాల్లో ఈ కారు ఉపయోగించినట్లు సమాచారం.

ఫొటోలో కనిపించే ఈ కారు 1958 మోడల్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాడిలాక్ సెడాన్ అని తెలుస్తోంది. ఇది ఒకప్పుడు ధీరూభాయ్ అంబానీ ఉపయోగించినట్లు చెబుతున్నారు. ఇది పాతకాలపు కారు అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తోంది. దీనికి MAS 2100 నెంబర్ ఉంది. ఈ కారుని ఎప్పుడు కొనుగోలు చేశారనేదానికి ఖచ్చితమైన అధరాలు లేవు. ప్రస్తుతం ఈ మోడల్ కారు మార్కెట్లో లేదు.

(ఇదీ చదవండి: భారత్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?)

భారతీయ మార్కెట్లో ఒకప్పుడు కాడిలాక్ కారు వివిధ రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభించేది. అయితే మోహన్ లాల్ గ్యారేజిలో ఉన్న ఆ కారు ఇంజిన్ స్పెషిఫికేషన్స్ కూడా వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పటికీ మంచి కండిషన్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మోహన్ లాల్ గ్యారేజిలో టొయోట వెల్‌ఫైర్, ఇన్నోవా క్రిష్టా, టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్350, లంబోర్ఘిని ఉరుస్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)