Breaking News

భారత్‌కు గడ్డుకాలం ముగిసినట్టే: డాయిష్‌ బ్యాంక్‌

Published on Thu, 02/27/2025 - 11:10

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం ముగిసినట్టేనని జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో జీడీపీ 5.4 శాతానికి (ఏడు త్రైమాసికాల కనిష్టం) పడిపోవడం తెలిసిందే. దీంతో దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలో డిసెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ 6.2 శాతానికి మెరుగుపడుతుందని బ్యాంక్‌ అంచనా వేసింది. అయినప్పటికీ 2025–26లో జీడీపీ వృద్ధి 7 శాతం లోపే ఉంటుందని పేర్కొంది.

క్యూ3 (2024 అక్టోబర్‌-డిసెంబర్‌) జీడీపీ గణాంకాలు విడుదల కావడానికి ముందు  బ్యాంక్‌ ఈ నివేదిక విడుదల చేయడం గమనార్హం. కీలక సూచికలు సైతం వృద్ధి రేటు 6.2 శాతానికి పెరుగుతుందని సూచిస్తున్నట్టు తెలిపింది. వృద్ధికి మద్దతుగా ఏప్రిల్‌ మానిటరీ పాలసీ సమీక్షలోనూ ఆర్‌బీఐ మరో 25 బేసిస్‌ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని అంచనా వేసింది. అనంతరం 0.50 శాతం రేటు బదిలీ దిశగా లిక్విడిటీ చర్యలపై ఆర్‌బీఐ దృష్టి సారించొచ్చని తెలిపింది.

ప్రస్తుత సైకిల్‌లో మరిన్ని రేట్ల కోతలు ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. లిక్విడిటీ అవసరాల పట్ల ఆర్‌బీఐ ఇప్పటికే దృష్టి పెట్టిందంటూ.. ఇటీవల 10 బిలియన్‌ డాలర్ల స్వాప్‌ ప్రకటన ప్రోత్సాహనీయంగా పేర్కొంది.

జీడీపీలో పన్నుల నిష్పత్తిని పెంచుకోవాలి: ఈవై
భారత్‌ 6.5 - 7 శాతం మేర జీడీపీ వృద్ధిని నమోదు చేయాలంటే, పన్నుల పరిధిని 1.2 - 1.5 శాతం స్థాయిలో కొనసాగించాలని ఈవై సూచించింది. ఆదాయ వసూళ్లను బలోపేతం చేసుకోవాలంటూ.. జీడీపీలో పన్నుల నిష్పత్తిని 2025 - 26లో 12 శాతం అంచనా స్థాయి నుంచి 2030 - 31 నాటికి 14 శాతానికి పెంచుకోవాలని పేర్కొంది. ద్రవ్య నిర్వహణ, నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను చెల్లింపుదారుల పరిధిని పెంచుకోవడంపై భారత్‌ దృష్టి సారించాలని సూచించింది. 2025–26లో భారత జీడీపీ 6.3 - 6.8 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)