Breaking News

వంట నూనె ప్యాకెట్లకు ‘ప్రామాణిక’ కొలతలు..! 

Published on Sun, 06/07/2026 - 05:43

న్యూఢిల్లీ: వంట నూనెల విక్రయాల్లో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ప్యాకెట్లను ఇకపై నిర్దిష్ట ప్రామాణిక కొలతల్లోనే విక్రయించాలని నిబంధన తెచ్చింది. దీంతో వినియోగదారులు ఏ బ్రాండ్‌ నూనె తక్కువ ధరకు వస్తుందో సులభంగా పోల్చి చూసుకోవచ్చు. అందుకు అనుగుణంగా ‘లీగల్‌ మెట్రాలజీ’ నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త నిబంధనలను అమలు చేసేందుకు తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు ప్రభుత్వం మూడు నెలల గడువు ఇచి్చంది. 

తొమ్మిది ప్రామాణిక కొలతల్లోనే ప్యాకింగ్‌ .. 
సవరించిన ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌’ (ఎస్‌ఓపీ) ప్రకారం దేశంలోని ప్రధాన వంట నూనెలకు 200 మి.లీ./గ్రా., 500 మి.లీ./గ్రా., ఒక లీటర్‌/కిలో, రెండు లీటర్లు/కిలోలు, మూడు లీటర్లు/కిలోలు, నాలుగు లీటర్లు/కిలోలు, 5 లీటర్లు/కిలోలు, 15 లీటర్లు/కిలోలు, 20 లీటర్లు/కిలోల ప్రామాణిక ప్యాకేజింగ్‌ పరిమాణాలను నిర్ణయించింది. పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్, ఆవనూనె, వేరుశనగ, నువ్వులు, రైస్‌బ్రాన్, పత్తిగింజలు, మొక్కజొన్న నూనెలతో పాటు మిశ్రమ వంట నూనెలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. దేశీయంగా తయారయ్యే, విదేశాల నుంచి దిగుమతి అయ్యే వంట నూనెలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం తెలిపింది.  

పరిమాణంతో పాటు ‘బరువు’ కూడా చెప్పాల్సిందే .. 
ప్యాకెట్లపై నూనె పరిమాణాన్ని మిల్లీలీటర్లు లేదా లీటర్లలో చూపినట్లయితే, దానికి సమానమైన బరువును కూడా గ్రాములు లేదా కిలోగ్రాములలో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే 200 మి.లీటర్లు లేదా 200 గ్రాముల కంటే చిన్న ప్యాకెట్లకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు. అలాగే తక్కువగా వాడే కొన్ని రకాల నూనెలకు కూడా ఈ కొత్త రూల్స్‌ వర్తించవు. గడువు పూర్తికాకముందే ఈ విధానాన్ని అమలు చేయాలనుకునే సంస్థలు వెంటనే అమలు చేయవచ్చని కేంద్రం పేర్కొంది.  

మార్కెట్‌లో గందరగోళానికి తెర: ఐవీపీఏ 
కేంద్ర నిర్ణయాన్ని ఇండియన్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (ఐవీపీఏ) అధ్యక్షుడు సుధాకర్‌ దేశాయ్‌ స్వాగతించారు. ‘‘ఈ చర్యతో రిటైల్‌ మార్కెట్‌లో క్రమబద్ధత ఏర్పడటంతో పాటు పోటీలో అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమకు స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో గతంలో ప్రామాణికతను తొలగించారు. అయితే మూడేళ్లుగా భిన్న పరిమాణాల ప్యాకెట్ల విస్తరణతో మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. తాజా నిర్ణయంతో వినియోగదారుల్లో ఏర్పడిన అయోమయం తొలగిపోతుంది’’ అని సుధాకర్‌ అన్నారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)