Breaking News

ఎన్నికల ఎఫెక్ట్‌.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్‌..

Published on Mon, 03/11/2024 - 20:29

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దాంతో రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటి వారికి ఇది చేదు వార్తే. ప్రచారాలకు వెళ్లే వారు చాలాసార్లు సమయాభావం కారణంగా హెలికాప్టర్లను వాడుతుంటారు. అయితే వాటి రేట్లు భారీగా పెరిగినట్లు తెలిసింది. 

గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చార్టెర్డ్ విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ 40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి ద్వారా మారుమూల గ్రామాలకు కూడా తక్కువ సమయంలో వెళ్లే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ఎక్కువగా హెలికాఫ్టర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే అగ్రిమెంట్లు సైతం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.

హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు గంటల ప్రాతిపదికన ఛార్జీలను లెక్కిస్తారు. చార్టర్డ్ విమానం కోసం గంటకు ధర రూ.4.5 లక్షలు నుంచి రూ.5.2 లక్షల మధ్య ఉన్నట్లు సమాచారం. ఇక హెలికాఫ్టర్‌కు సుమారు రూ.1.5 లక్షలు ఛార్జ్ చేస్తారు. డిసెంబర్ 2023 చివరి నాటికి 112 నాన్ షెడ్యూల్ ఆపరేటర్లు ఈ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక డేటా ద్వారా తెలిసింది. 

ఇదీ చదవండి: ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి

ఎన్నికల్లో చాపర్లతో సహా 450 విమానాలు కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఎండీ కెప్టెన్ ఆర్కే బాలి తెలిపారు. సీటింగ్ కెపాసిటీ 3 నుంచి 37 వరకు ఉంటాయన్నారు. 10 కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగిన హెలికాప్టర్లు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)