Breaking News

ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్‌ ఆఫర్‌

Published on Sun, 04/13/2025 - 09:07

ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీ) ఆదరణ పెరుగుతుండడంతో ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాల్లో వాటి కొనుగోళ్లకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఈవీలను ప్రోత్సహించడంతోపాటు అక్కడ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో ఈవీ స్వీకరణను వేగవంతం చేయడానికి, వాయు కాలుష్యం సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ 2.0ను ప్రవేశపెట్టింది.

ఈ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుపై రూ.36,000 వరకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా మహిళా కొనుగోలుదారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న మొదటి 10,000 మంది మహిళలకు ఈ సబ్సిడీ లభిస్తుందని పేర్కొంది. ఈ విధానం ప్రధాన ఉద్దేశం పర్యావరణహితమైన అనుకూల రవాణా అందించేలా వాహనదారులను ప్రోత్సహించడం, వాహనం ఉండాలని కొరుకునే మహిళలకు ఆర్థిక అవరోధాన్ని తగ్గించడం అని ప్రభుత్వం తెలిపింది.

అదనపు ప్రోత్సాహకాలు

ఈ విధానంలో భాగంగా పాత, కాలుష్యకారక శిలాజ ఇంధనంతో నడిచే వాహనాలను స్క్రాప్ చేసే వారు కొత్త ఈవీ వాహనం కొనుగోలు చేస్తే ప్రయోజనాలను అందించనుంది. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు, వాణిజ్య వాహనాలు వంటి విభాగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది పరిశుభ్రమైన, గ్రీన్‌ మొబిలిటీకి ఎంతో తోడ్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అమెరికా దెబ్బకు చైనా ఔట్‌?

మహిళలకు ఎంతో మేలు

ఢిల్లీ వంటి కాలుష్యకారక నగరాలకు ఇలాంటి పాలసీలు ఎంతో తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నాయి. ఈ నగరంలో ఏడాది పొడవునా తీవ్రమైన వాయు కాలుష్యం ఉంటోంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0 పర్యావరణ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, మహిళల అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్ముతున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉండటంతో మహిళ రోజువారీ ప్రయాణంపై భరోసాను కలిగి ఉంటారని చెబుతున్నారు. ఇది ప్రజా రవాణాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. వ్యక్తిగత వాహనాలతో మహిళలు ఏ సమయంలోనైనా సురక్షితంగా ప్రయాణించవచ్చు.

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)