Breaking News

చాలా ఫోన్‌లలో వాడుతున్న ఆ బ్రౌజర్‌.. డేంజర్‌!

Published on Fri, 08/29/2025 - 13:25

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఫోన్‌లను  వినియోగిస్తున్నారు. రు. అయితే ఈ ఫోన్‌లలో ఏ బ్రౌజర్‌ వాడాలి.. ఏది సురక్షితం అన్న అవగాహన చాలా మందికి ఉండటం లేదు. ఫోన్‌లలో డిఫాల్ట్‌ ఏ బ్రౌజర్‌ ఇస్తే అదే వాడుతున్నారు. చాలా ఫోన్‌లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ డీఫాల్ట్‌గా వస్తోంది. దీంతో ప్రైవసీకి ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆన్‌లైన్ భద్రతలో ప్రత్యేకత కలిగిన సర్ఫ్‌ షార్క్‌ అనే సంస్థ ఇటీవల కొన్ని పరిశోధనలు చేసింది. ఇందులో క్రోమ్ దాని పోటీదారుల కంటే ఎంత ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించింది. క్రోమ్‌కు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్లను గూగుల్ జోడించినప్పటికీ  ఇప్పటికీ చాలా డేటాను బ్యాక్‌ గ్రౌండ్‌లో ట్రాక్ చేయడం మాత్రం మానడం లేదని బీజీఆర్ నివేదిక తెలిపింది.

అన్నీ ట్రాక్‌ చేస్తోంది..
ఆటోఫిల్, వ్యక్తిగతీకరించిన వార్తలు వంటి క్రోమ్ ఫీచర్లు పైకి జీవితాన్ని సులభతరం చేసేవిగా ఉన్నా కానీ అవే ఫీచర్లను గూగుల్ అడ్వర్టైజింగ్, అనలిటిక్స్ నెట్‌వర్క్‌లు కూడా ఉపయోగిస్తున్నాయి. దీని అర్థం ఏమిటంటే మీరు ఆన్‌లైన్లో ఎలా ప్రవర్తిస్తారో వివరణాత్మక చిత్రాన్ని రూపొందించడానికి మీరు చేసే క్లిక్‌లు, సెర్చ్‌లు, వెబ్ పేజీలో మీరు గడిపే సమయం కూడా ఎల్లప్పుడూ ట్రాక్ అవుతుందన్న మాట.

ఇదేదో ఊహాజనితంగా చెబుతున్న విషయం కాదు. ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఉపగించినవారి సమాచారాన్ని కూడా ట్రాక్ చేసినందుకు 2020లో గూగుల్‌పై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ప్రైవేట్ బ్రౌజింగ్ సెషన్ల సమయంలో సేకరించిన కోట్లాది రికార్డులను తొలగించేందుకు గూగుల్‌ అంగీకరించింది.

సర్ఫ్ షార్క్ పరిశోధన ప్రకారం, బ్రౌజింగ్ హిస్టరీ, సేవ్ చేసిన చెల్లింపు సమాచారం, కాంటాక్ట్ జాబితాలు వంటి సమాచారాన్ని క్రోమ్ సేకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉన్నారు, కాబట్టి సేకరించే డేటా మొత్తం భారీగా ఉంటుంది. ఇదంతా యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచేందుకేనని పైకి చెబుతున్నా తెర వెనుక చాలా మందికి తెలియకుండానే వారి డేటా చోరీకి గురవుతోంది.

ప్రత్యామ్నాయాలు లేవా?
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ముప్పుతో కూడిన గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌కు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. బ్రౌజర్లను మార్చడం సులభం. బ్రేవ్, డక్ డక్గో, ఫైర్‌ఫాక్స్, టోర్ ఇవన్నీ ట్రాకర్లను ఆపివేసే,  బ్యాక్‌గ్రౌండ్‌లో సేకరించగల డేటా మొత్తాన్ని పరిమితం చేసే గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే బ్రౌజర్లు. సెట్టింగ్ లలో మార్పులు చేసుకుని, ఈ బ్రౌజింగ్‌ యాప్‌లకు మారడం ద్వారా మీ ఫోన్‌ నుండి వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లకుండా  పరిమితం చేయవచ్చు. క్రోమ్ కూడా ఇటీవల ట్రాకింగ్ తగ్గించడంలో సహాయపడటానికి ఐపీ అడ్రస్ మాస్కింగ్ వంటి సాధనాలను జోడించింది. కానీ ఇది ఇప్పటికీ డేటా-హెవీ బ్రౌజర్ అనే వాస్తవాన్ని మార్చదని నిపుణులు అంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)