Breaking News

ఆరోగ్య బీమా .. పన్ను ప్రయోజనాల ధీమా

Published on Mon, 05/27/2024 - 08:45

దేశీయంగా ఆరోగ్య సంరక్షణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో మంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం తీసుకోవడంతో పాటు మీ ఆర్థిక స్థితిని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సైతం మీకు తోడ్పడుతుంది. ఇది కేవలం వైద్యం ఖర్చులకే ఉపయోగపడటం కాకుండా మీకు పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తుంది.  

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80డీ కింద ఆరోగ్య బీమాతో మీరు ఏటా రూ. 75,000 వరకు పన్నులపరంగా ఆదా చేసుకునే వీలుంది. మీ స్వంతానికి, జీవిత భాగస్వామి, పిల్లలు, మీపై ఆధారపడిన తల్లిదండ్రుల ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలపై మీరు డిడక్షన్స్‌ను క్లెయిమ్‌ చేయొచ్చు. వయస్సుపరమైన మినహాయింపు పరిమితులను తెలుసుకోవడం, సరైన రికార్డులను దగ్గర ఉంచుకోవడం ద్వారా పన్నులపరమైన ప్రయోజనాలను పొందేందుకు వీలుంటుంది.  

ఇక క్రిటికల్‌ ఇల్‌నెస్‌ బీమా కూడా మరో కీలకమైనది. నిర్దిష్టమైన తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు నిర్ధారణ అయితే, ఇది ఒకేసారి చెల్లింపును అందిస్తుంది. ఆరోగ్యపరంగా అనూహ్య ప్రతికూలతల నుంచి సమగ్ర రక్షణను అందించే ఈ రకమైన బీమా కోసం చెల్లించే ప్రీమియంలకు కూడా సెక్షన్‌ 80డీ కంద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. మరోవైపు, సెక్షన్‌ 80డి కింద మొత్తం పరిమితిలో రూ.5000 దాకా ప్రివెంటివ్‌ ఆరోగ్య పరీక్షల కోసం పెట్టిన ఖర్చులను తీసివేయడానికి కూడా వీలుంటుంది. ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌  ప్రాధాన్యతను, పన్ను ప్రయోజనాలను వివరంగా తెలియజేయడం ద్వారా తరచుగా చెకప్‌లు చేయించుకునేలా, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు సాధ్యపడుతుంది. 

దేశీయంగా చాలా మటుకు సంస్థలు ఉద్యోగులకు ప్రయోజనాల ప్యాకేజీ కింద ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి. ఇలాంటి పాలసీల కోసం యజమానులు చెల్లించే ప్రీమియంలు, సాధారణంగా ఉద్యోగులకు పన్నురహితంగా ఉంటాయి. అయితే, ఉద్యోగులు తమకు లేదా తమ కుటుంబాల కోసం వ్యక్తిగతంగా అదనపు కవరేజీ తీసుకున్నట్లయితే వారు కట్టే ప్రీమియంలకు సెక్షన్‌ 80డీ కింద డిడక్షన్‌ లభించగలదు.  

అటు మొత్తం కుటుంబానికి ఒకే ప్లాన్‌లో కవరేజీ ఇచ్చేలా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత ప్లాన్‌లతో పోలిస్తే వీటిల్లో డబ్బు ఆదా చేసేందుకు అవకాశం ఉంది. వీటికి కట్టే ప్రీమియంలకు కూడా సెక్షన్‌ 80డీ కింద పన్ను మినహాయింపులు ఉంటాయి.  

ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్‌ 80 ఈ కింద రూ. 75,000  వరకు పన్ను ప్రయోజనాలు అందు బాటులో ఉన్నాయి. పన్ను చట్టాలలో మార్పుకు లోబడి (స్వీయ/భార్య/భర్త/తమపై ఆధారపడిన పిల్లలకు రూ. 25,000 మరియు సీనియర్‌ సిటిజన్‌ తల్లిదండ్రులకు రూ. 50,000) ఇవి ఉంటాయి.

పథకాన్ని ఎంచుకోవడం కీలకం
ఆరోగ్య బీమా పాలసీలనేవి అనారోగ్యం వేళ ఆర్థిక భరోసాగా నిలవడమే కాకుండా మీ పన్ను భారాన్ని కూడా తగ్గించుకునేందుకు ఉపయోగపడగలవు. సెక్షన్‌ 80డీ తో మీ పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. కనుక, మీరు అలాగే మీ కుటుంబం ఆర్థిక స్వేచ్ఛ సాధించే దిశగా వెళ్లే క్రమంలో సరైన ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం..

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)