Breaking News

భారత్‌లో మొదటిసారి ప్రవేశించిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా..

Published on Fri, 03/15/2024 - 09:01

కార్లంటే కొందరికి అవసరానికి ఉపయోగపడే వస్తువుగా ఉంటే.. ఇంకొందరికి అవో లగ్జరీ సింబల్‌గా మారుతున్నాయి. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేసి మరీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అలాంటి ఓ లగ్జరీ కారు తాజాగా మన దేశ రోడ్లపైకి వచ్చింది. భారత్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన ఆస్టన్ మార్టిన్ డీబీ12 స్పోర్ట్స్‌ కారు అది. 

ఈ ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారు ధర సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు. అయితే ఇంతకీ ఈ కారును కొన్న వ్యక్తి ఎవరిని అనుకుంటున్నారా. అలాంటి యోగం సాధారణ ప్రజలకు ఎక్కడుంటుంది. దీన్ని కొన్నది ఏకంగా రూ.1.34లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌ కలిగిన ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌. 

ఇదీ చదవండి: ఏడు నిమిషాల్లో ఊడిన ఉద్యోగాలు

ఆస్టన్‌ మార్టిన్‌ బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ. ఈ కంపెనీ డీబీ12 పేరుతో గతేడాది సెప్టెంబరులో కారును లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.4.59 కోట్లు. దీపిందర్‌ గోయల్‌ ఈ లగ్జరీ కారును తాజాగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ స్పోర్ట్స్‌ కార్‌ మెర్సిడెస్-బెంజ్-సోర్డ్స్‌ ఇంజిన్‌తో రూపొందించారు. 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్డ్‌ వీ8 ఇంజిన్‌ కలిగి ఉంది. కేవలం 3.5 సెకెన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీన్ని ప్రత్యేకత.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)