Breaking News

డెట్‌ ఫండ్స్‌కు అమ్మకాల సెగ 

Published on Thu, 10/23/2025 - 01:32

న్యూఢిల్లీ: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు సెప్టెంబర్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఏకంగా రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులను కోల్పోయాయి. అంతకుముందు ఆగస్ట్‌ నెలలో ఇన్వెస్టర్లు డెట్‌ ఫండ్స్‌ నుంచి ఉపసంహరించుకున్న మొత్తం రూ.7,980 కోట్లుగానే ఉంది. సంస్థాగత ఇన్వెస్టర్లు లిక్విడ్, మనీ మార్కెట్‌ ఫండ్స్‌ నుంచి పెద్ద మొత్తంలో (రూ.66,042 కోట్లు) వెనక్కి తీసుకోవడమే ఇందుకు కారణమని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) డేటా తెలియజేస్తోంది. జూలైలోనూ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ రూ.1.07 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. 

డెట్‌లో మొత్తం 16 కేటగిరీలకు గాను 12 విభాగాల ఫండ్స్‌ నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. సెప్టెంబర్‌ చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని డెట్‌ పెట్టుబడుల విలువ 5 శాతం తగ్గి రూ.17.8 లక్షల కోట్లకు పరిమితమైంది. ఆగస్ట్‌ చివరికి ఈ మొత్తం రూ.18.71 లక్షల కోట్లుగా ఉంది. ‘బడా సంస్థలు త్రైమాసికం చివర్లో నిధులపరమైన సర్దుబాట్లు, ముందస్తు పన్ను చెల్లింపుల అవసరాల దృష్ట్యా లిక్విడ్, మనీ మార్కెట్‌ ఫండ్స్‌ నుంచి అధిక మొత్తంలో పెట్టుబడులను ఉపసంహరించుకుని ఉండొచ్చు’’అని మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ నేహల్‌ మెష్రామ్‌ తెలిపారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)