Breaking News

డెట్‌ ఫండ్స్‌లోకి రూ.1.57 లక్షల కోట్లు

Published on Mon, 11/18/2024 - 08:21

న్యూఢిల్లీ: డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు అక్టోబర్‌లో డిమాండ్‌ ఏర్పడింది. ఏకంగా రూ.1.57 లక్షల కోట్లను డెట్‌ ఫండ్స్‌ ఆకర్షించాయి. సెప్టెంబర్‌ నెలలో ఇదే విభాగం నుంచి రూ.1.14 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోగా, మరుసటి నెలలోనే పరిస్థితుల్లో పూర్తి మార్పు కనిపించింది.

ముఖ్యంగా డెట్‌లో మొత్తం 16 కేటగిరీలకు గాను 14 విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. దీంతో డెట్‌ ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) 11 శాతం వృద్ధితో అక్టోబర్‌ చివరికి రూ.16.64 లక్షల కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్‌ చివరికి ఇవి రూ.14.97 లక్షల కోట్లుగా ఉన్నట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

స్వల్పకాల ఫండ్స్‌కు ఆదరణ  
» లిక్విడ్‌ ఫండ్స్‌ అత్యధికంగా 83,863 కోట్లను రాబట్టాయి. అక్టోబర్‌ నెలలో మొత్తం డెట్‌ పెట్టుబడుల్లో సగం లిక్విడ్‌ ఫండ్స్‌లోకే వచ్చాయి. » ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ రూ.25,784 కోట్లు, మనీ మార్కెట్‌ ఫండ్స్‌ రూ.25,303 కోట్ల చొప్పున ఆకర్షించాయి.  
» అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ (12 నెలల్లోపు) ఫండ్స్‌లోకి రూ.7,054 కోట్లు వచ్చాయి.  
» లో డ్యురేషన్‌ ఫండ్స్‌ రూ.5,600 కోట్లు, కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ రూ.4,644 కోట్లు, షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ రూ.1,362 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ప్రధానంగా తక్కువ కాలానికి ఉద్దేశించని డెట్‌ ఫండ్స్‌కు ఆదరణ లభించింది. 
» నాలుగు నెలల విరామం తర్వాత బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.936 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  
» గిల్ట్‌ ఫండ్స్‌ రూ.1,375 కోట్లు, లాంగ్‌ డ్యురేషన్‌ బాండ్‌ ఫండ్స్‌ రూ.1,177 కోట్ల చొప్పున ఆకర్షించాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)