Breaking News

‘తప్పు చేశాం.. మళ్లీ చేస్తాం..10వేల డాలర్లు ఇస్తాం..’

Published on Mon, 04/15/2024 - 09:19

భారత కస్టమర్‌ పేరును వక్రీకరిస్తూ కెనడాకు చెందిన ‘డీబ్రాండ్‌’ కంపెనీ చేసిన ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో చేసేదేమిలేక కంపెనీ క్షమాపణలు చెబుతూ గుడ్‌విల్‌ కింద 10వేల డాలర్లను ఆఫర్‌ చేసింది. ఇకనుంచి కస్టమర్లపై జోకులు వేసేముందు మరింత జాగ్రత్తగా ఉంటామని చెప్పడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. భువన్‌ చిత్రాంశ్‌ అనే భారత వ్యక్తి ఇటీవల కెనడాకు చెందిన డీబ్రాండ్‌ అనే ఎలక్ట్రానిక్స్‌ యాక్సెసరీస్‌ కంపెనీ నుంచి యాపిల్‌ మ్యాక్‌బుక్‌ స్క్రీన్‌పై భాగంలో ఉండే కవర్‌ను కొనుగోలు చేశారు. రెండు నెలలు అవ్వకముందే ఆ కవర్‌ రంగు వెలిసిపోయింది. దాంతో ‘ఎక్స్‌’ వేదికగా కంపెనీ అధికారిక అకౌంట్‌ను ట్యాగ్‌ చేస్తూ తన సమస్య తెలిసేలా ఫిర్యాదు చేశాడు. 

ఈ వ్యవహారంపై డీబ్రాండ్‌ విచిత్రంగా స్పందించింది. అతడి పేరు చిత్రాంశ్‌.. అయితే ‘షిట్‌ రాష్‌’ అని విపరీతార్థం వచ్చేలా రాసింది.  అతడి పేరులోని అక్షరాలను అలా మార్చి రాయడంపట్ల నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. భారతీయుడి పేరుపై వెటకారపు వ్యాఖ్యలు చేయడం తగదంటూ తీవ్రంగా స్పందించారు. చిత్రాంశ్‌ కంపెనీ ట్వీట్‌కు ప్రతిస్పందనగా భారత్‌ కస్టమర్లపై కొన్ని రాసిస్ట్‌ కంపెనీల దృక్పథం ఎలా ఉందో తెలిసిపోయిందని తెలియజేస్తూ పీఎం మోదీ, కామర్స్‌ మినిస్టర్‌ పీయుష్‌గోయల్‌ అకౌంట్‌ను ట్యాగ్‌ చేశాడు.

ఇదీ చదవండి: కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..

దాంతో కంపెనీ స్పందించి కస్టమర్‌ పేరును వక్రీకరించామని అంగీకరించింది. దీన్ని అతిపెద్ద తప్పిదంగా భావిస్తూ క్షమాపణ కోరింది. గుడ్‌విల్‌ కింద 10,000 డాలర్లు చిత్రాంశ్‌కు ఆఫర్‌ చేసింది. అయితే, ఇలా కస్టమర్లతో సరదాగా జోకులు వేయడం దాదాపు దశాబ్దకాలంగా చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇలా యూజర్లపై సరదాగా జోకులు వేయడం మాత్రం ఆపబోమని చెప్పింది. అంతటితో ఆగకుండా తర్వాత 10,000 డాలర్లను అందుకోబోయేది మీలో ఒకరు కావచ్చంటూ ట్వీట్‌ చేసింది.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)