Breaking News

ఆధార్‌ డేటాపై హాట్‌మెయిల్‌ కోఫౌండర్‌ సంచలన ఆరోపణలు

Published on Fri, 11/21/2025 - 11:53

భారత పౌరుల ఆధార్‌ డేటా భద్రతపై హాట్‌ మెయిల్‌ కోఫౌండర్‌ సబీర్ భాటియా సంచలన ఆరోపణలు చేశారు. పౌరుల ఆధార్‌ డేటా దుర్వినియోగం అయ్యి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రిప్టో నేరస్తులు ఈ డేటాను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ సబీర్ భాటియా ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

‘మొత్తం ఆధార్ డేటాబేస్‌ను క్రిప్టో నేరస్థులు దొంగిలించినట్లు ఓ కథనం ఉంది. 815 మిలియన్ల మంది డేటాను 80,000 డాలర్లకు అమ్మేసినట్లు చెబుతున్నారు. ఇది నిజమో కాదో నేను ధృవీకరించలేను... కానీ ఇది లోతైన సాంకేతిక నైపుణ్యం లేకుండా సంక్లిష్టమైన వ్యవస్థలను రూపొందించడం వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా ఆధార్ సంబంధిత సంఘటనను ప్రపంచంలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘనగా అభివర్ణించింది’ భాటియా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

భారత ఆధార్‌ డేటా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం​ చేస్తూ ఆయన పెట్టిన ప్రతిస్పందనల వరదకు దారితీసింది. కొంత మంది ఆయన వాదనను సమర్థించగా మరికొంత మంది విమర్శించారు. ఇలా ఆధారాలు లేకుండా అనుమానాలను కల్పించడం వెనుక ఆయన ఉద్దేశాలను ప్రశ్నించారు. ఆధారాలు లేనప్పుడు పబ్లిక్ ప్లాట్ ఫామ్ లపై రాయడం మానుకోండి అంటూ హితవు పలికారు.

సబీర్ భాటియా ఆధార్‌ వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆధార్‌ డిజైన్‌, వ్యయంపై ఆయన గతంలోనూ విమర్శలు చేశారు. గత ఫిబ్రవరిలో ఓ పోడ్ కాస్ట్ లో భాటియా మాట్లాడుతూ ఆధార్‌ నిర్మాణానికి 1.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారని, కానీ 20 మిలియన్‌ డాలర్లతోనే దీన్ని చేసి ఉండవచ్చిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆధార్‌ కోసం ఉపయోగిస్తున్న బయో మెట్రిక్స్‌పై అనుమానం వ్యక్తం చేసిన ఆయన వీడియో, వాయిస్‌ ఆథెంటికేషన్‌ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలను సూచించారు.

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)