Breaking News

డీఏ పెరిగింది.. మరి జీతమెంత పెరుగుతుంది?

Published on Wed, 10/01/2025 - 19:19

కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ పెంచింది. దసరా,దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, రిటైరైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. డీఏ అంటే ఏమిటి.. దాన్ని ఎలా లెక్కిస్తారు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఈ కథనంలో తెలుసుకుందాం..

డీఏ అంటే ఏమిటి?
డీఏ అంటే డియర్‌నెస్ అలవెన్స్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ప్రభావాన్ని ఎదుర్కోవడంలో సహాయపడేందుకు డీఏ చెల్లిస్తారు. ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల ధరలు పెరుగుతుంటాయి. దీనివల్ల జీవన వ్యయం అధికమవుతుంది. దీన్ని తగ్గించడానికే ఎప్పటికప్పుడు డీఏను పెంచుతుంటారు. డీఏ పెరిగితే ఉద్యోగులకు ప్రతినెలా చేతికందే జీతమూ పెరుగుతుంది.

ఎలా లెక్కిస్తారు? 
ఉద్యోగుల మూల వేతనం అంటే బేసిక్‌ శాలరీపై లెక్కిస్తుంటారు. వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్  3 శాతం పెంపుకు ఆమోదం తెలిపారు. తాజా పెంపు డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతుంది.

జీతంలో ఎంత పెరుగుంది?
ఉదాహరణకు ఉద్యోగి బేసిక్ జీతం రూ.50,000 అనుకుంటే ఇప్పుడున్న 55 శాతంతో డీఏ రూ.27,500. తాజాగా 3 శాతం పెరిగింది కాబట్టి ఇది 58 శాతానికి చేరుతుంది. రూ.50,000 జీతంపై 58 శాతం డీఏ 29,000 అవుతుంది. అంటే ఉద్యోగికి ప్రతినెలా అందే జీతంలో రూ.1,500 పెరుగుతుందన్న మాట. అయితే హెచ్‌ఆర్‌ఏ, టీఏ వంటి ఇతర అలవెన్సులు డీఏ పెంపుతో మారవు. పెన్షనర్లకు డీఆర్‌ (Dearness Relief) రూపంలో ఇదే శాతం వర్తిస్తుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)