Breaking News

స్వయం కృషికి నిదర్శనం.. డీమార్ట్, జొమాటో, స్విగ్గీ

Published on Thu, 12/19/2024 - 05:44

ముంబై: స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఈ ఏడాదీ ‘డీమార్ట్‌’ రాధాకిషన్‌ దమానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ‘డీమార్ట్‌’ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన రిటైల్‌ చైన్‌ చక్కని ఆదరణ పొందుతుండడం తెలిసిందే. డీమార్ట్‌ మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ విలువ రూ.3.4 లక్షల కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో 44 శాతం పెరిగింది. 

జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన జొమాటో విలువ ఏడాది కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.2,51,900 కోట్లకు చేరింది. శ్రీహర్ష మాజేటి, నందన్‌ రెడ్డి నెలకొల్పిన స్విగ్గీకి మూడో స్థానం దక్కింది. కంపెనీ విలువ ఏడాది కాలంలో 52 శాతం పెరిగి రూ.1,01,300 కోట్లుగా ఉంది. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీలతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్, హరూన్‌ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి. 

గతేడాది హరూన్‌ జాబితాలోనూ డీమార్ట్‌ మొదటి స్థానంలో ఉండగా, ఫ్లిప్‌కార్ట్, జొమాటో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది జాబితాలో టాప్‌–10లో ఉన్న ఫ్లిప్‌కార్ట్, పేటీఎం,  క్రెడ్‌ ఈ సారి టాప్‌–10లో చోటు కోల్పోయాయి. ముఖ్యంగా స్వయంకృషితో ఎదిగిన మహిళా అగ్రగామి పారిశ్రామికవేత్తగా ఫాల్గుణి నాయర్‌కు పదో స్థానం దక్కడం గమనార్హం. స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన టాప్‌–200లో 66 కంపెనీలు బెంగళూరు కేంద్రంగా ఉంటే, 36 కంపెనీలకు ముంబై, 31 కంపెనీలకు గురుగ్రామ్‌ చిరునామాగా ఉన్నాయి.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)