Breaking News

'వెండి కాయిన్స్ ఆర్డర్ చేస్తే.. నూడుల్స్ వచ్చాయి'

Published on Sun, 09/28/2025 - 14:51

డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత దాదాపు షాపుకు వెళ్లి కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా తగ్గింది. కొత్తిమీర దగ్గర నుంచి బంగారం వరకు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసే సమయంలో కొన్ని సార్లు మోసపోతున్నారు. పెట్టే ఆర్డర్ ఒకటైతే.. వచ్చే డెలివరీ ఇంకొకటి అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

''వెండి కాయిన్స్ ఆర్డర్ చేశాను. కానీ నాకు మ్యాగీ నూడుల్స్, హల్దిరామ్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయి. అంతే కాకుండా నాకు వచ్చిన డెలివరీలో ఒక పౌచ్ కూడా ఉంది. దానికి సీల్ చేసి ఉంది. డెలివరీ భాగస్వామి ఆ సీల్ ఓపెన్ చేయలేనని అన్నారు. మొత్తం ఆర్డర్ తీసుకోండి లేదా క్యాన్సిల్ చేయండి.. అని డెలివరీ బాయ్ నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు. 40 నిమిషాల తరువాత నేను పౌచ్ ఓపెన్ చేసాను. అందులో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. కానీ 999 ప్యూర్ సిల్వర్ కాదు. అవి 925 స్టెర్లింగ్ సిల్వర్'' అని వినీత్ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో స్విగ్గీ హర్రర్ స్టోరీ అని పోస్ట్ చేశారు.

నాకు వచ్చిన డెలివరీలో మ్యాగీ నూడుల్స్, హల్దిరామ్ ప్యాకెట్లను డెలివరీ ఏజెంట్‌నే తీసుకోమన్నాను. నేను వాటిని ఆర్డర్ చేయలేదు. కాబట్టి అవి నాకు వద్దని వినీత్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్విగ్గీ కూడా స్పందించింది.

వినీత్ మరో ట్వీట్ చేస్తూ.. ఈ సారి స్విగ్గీ నాకు స్వచ్ఛమైన వెండి నాణేలను డెలివరీ చేసిందని, దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఆర్డర్ ఐడీని షేర్ చేయమని స్విగ్గీ కోరింది. వినీత్ తన ఆర్డర్ ఐడీ షేర్ చేశారు. సమస్యను మా దృష్టికి తీసుకువచ్చినందుకు.. కావలసిన వివరాలను అందించినందుకు స్విగ్గీ వినియోగదారుకు ధన్యవాదాలు తెలిపింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)