Breaking News

పేపర్‌ నోట్ల స్థానే ప్లాస్టిక్‌ నోట్లు! ప్రభుత్వం వివరణ

Published on Fri, 06/12/2026 - 15:06

‘జూన్ 30 తర్వాత మీ జేబులోని కాగితపు కరెన్సీ నోట్లు చెల్లవు.. వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి’— ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో వైరల్‌ అవుతున్న ఒక పోస్ట్ సారాంశం ఇది. 2016 నాటి నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఈ వార్త వ్యాపార వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిజంగానే కాగితపు నోట్లను నిషేధిస్తోందా? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమంటోంది? అనే అంశాలను కింద చూద్దాం.

వైరల్ అవుతున్న పోస్ట్‌లో ఏముంది?

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్టుల ప్రకారం.. జూన్ 30, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. అదే తేదీ నుంచి వాటి స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ (పాలిమర్ నోట్లు) అమల్లోకి వస్తుందని ఆ పోస్టుల సారాంశం.

పీఐబీ ఫ్యాక్ట్ చెక్

ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఈ వాదనను పూర్తిగా నకిలీ (ఫేక్‌ న్యూస్‌) అని కొట్టిపారేసింది. ‘జూన్ 30, 2026 నాటికి కాగితపు నోట్లను దశలవారీగా తొలగించే లేదా వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఎలాంటి ప్రణాళికలు ఆర్‌బీఐ వద్ద లేవు. వివిధ సామాజిక గ్రూపుల్లో వచ్చే ధ్రువీకరించని సమాచారాన్ని, ఫార్వార్డ్ మెసేజ్‌లను గుడ్డిగా నమ్మవద్దు’ అని ప్రభుత్వం కోరింది. కరెన్సీకి సంబంధించిన ఎలాంటి వివరాల కోసమైనా నేరుగా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.

పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యలు

ఇటీవల (జూన్ 5, 2026న) జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్లాస్టిక్ నోట్లపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ‘పాలిమర్ నోట్ల ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే. మేము దాని వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాం. అయితే, ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో..

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)