Breaking News

చమురు సలసల.. రూపాయి విలవిల

Published on Sat, 06/14/2025 - 08:10

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర నిన్నటి మార్కెట్‌లో ఒక దశలో 13 శాతం పెరిగి 78 డాలర్లకు చేరింది. 2022 మార్చి తర్వాత ఒకే రోజు చమురు ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. నాడు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చమురు ధరలకు ఆజ్యం పోశాయి.

తాజాగా ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ అత్యున్నత నేత ఖమేనీ చేసిన ప్రకటన ఆందోళనలను మరింత పెంచింది. ఆ తర్వాత కొంత తగ్గి 74.32 డాలర్ల స్థాయికి బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు దిగొచ్చాయి. బెంచ్‌మార్క్‌ యూఎస్‌ క్రూడ్‌ సైతం 7%కి పైగా పెరిగి 73 డాలర్లకు చేరింది.  

ధరలు మరింత పెరగొచ్చు.. 

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు విస్తృతమైతే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు చేరుకోవచ్చని జేపీ మోర్గాన్‌ హెచ్చరించింది. మోర్గాన్‌ స్టాన్లీ అయితే 130 డాలర్ల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. చమురు ఉత్పత్తిలో ఇరాన్‌ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంటే, మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా తర్వాత రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉండడం గమనార్హం.  

ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్‌’

పెరిగిన క్రూడ్‌ ధరలతో కరిగిన రూపాయి 

క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 59 పైసలు బలహీనపడి 86.11 వద్ద స్థిరపడింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడితో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ డాలర్‌ బలపడటం కూడా మన కరెన్సీ ఒత్తిడికి లోనైంది. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో గురువారం ముగింపు(85.52)తో పోలిస్తే ఏకంగా 73 పైసల బలహీనతతో 86.25 వద్ద మొదలైంది. దేశీయ మే ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి దిగిరావడం.., ఆర్‌బీఐ జోక్యంతో రూపాయి కాస్త రికవరీ అయ్యింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)