Breaking News

అదానీ రుణ మదింపులో సవరణ

Published on Sat, 09/10/2022 - 04:39

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రూప్‌ రుణాలపై ఫిచ్‌ గ్రూప్‌ కంపెనీ క్రెడిట్‌సైట్స్‌ తాజాగా మాట మార్చింది. అదానీ గ్రూప్‌ యాజమాన్యంతో చర్చల తదుపరి రెండు కంపెనీల రుణ మదింపులో పొరపాట్లు జరిగినట్లు కొత్తగా జారీ చేసిన నోట్‌లో పేర్కొంది. అయితే గ్రూప్‌ అధిక రుణ భారాన్ని మోస్తున్నట్లు తెలియజేసింది. దీంతో తొలుత ఇచ్చి న ఇన్వెస్ట్‌మెంట్‌ సిఫారసుల విషయంలో ఎలాంటి మార్పులనూ చేపట్టడంలేదని స్పష్టం చేసింది.   

అదానీ గ్రూప్‌పై ఆగస్ట్‌ 23న ప్రకటించిన నివేదికలో రెండు కంపెనీల రుణ మదింపులో పొరపాట్లు జరిగినట్లు క్రెడిట్‌సైట్స్‌ వెల్లడించింది. గ్రూప్‌ అత్యంత భారీగా రుణగ్రస్తమైనట్లు గతంలో పేర్కొంది. పరిస్థితులు వికటిస్తే రుణ ఊబిలో కూరుకుపోవడంతోపాటు డిఫాల్ట్‌ అయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది.

కాగా.. తాజా నోట్‌లో అదానీ గ్రూప్‌నకు అత్యధిక స్థాయిలో రుణాలున్నట్లు మాత్రమే పేర్కొంది. వీటిపై స్పందనగా అదానీ గ్రూప్‌ నిర్వహణ లాభ నిష్పత్తితో పోలిస్తే నికర రుణభారం మెరుగుపడినట్లు ప్రకటించింది. గ్రూప్‌లోని కంపెనీలు నిలకడగా రుణ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు తెలియజేసింది. గత తొమ్మిదేళ్లలో ఇబిటాతో నికర రుణ నిష్పత్తి 7.6 రెట్ల నుంచి 3.2 రెట్లకు తగ్గినట్లు వివరించింది.  

పొరపాట్లు ఇలా
అదానీ గ్రూప్‌లోని అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్‌ రుణాల విషయంలో లెక్కల్లో తప్పులు దొర్లినట్లు క్రెడిట్‌సైట్స్‌ పేర్కొంది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఇబిటా అంచనాలను తాజాగా రూ. 4,200 కోట్ల నుంచి రూ. 5,200 కోట్లకు సవరించింది. ఇక అదానీ పవర్‌ స్థూల రుణ అంచనాలను రూ. 58,200 కోట్ల నుంచి రూ. 48,900 కోట్లకు తగ్గించింది. అయితే ఈ సవరణలతో ఇన్వెస్ట్‌మెంట్‌ రికమండేషన్స్‌లో ఎలాంటి మార్పులనూ చేపట్టలేదని క్రెడిట్‌సైట్స్‌ తెలియజేసింది. 

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)