Breaking News

షాపింగ్‌ చేస్తున్నారా? బెస్ట్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లున్న క్రెడిట్‌కార్డులు ఇవే..

Published on Sat, 11/04/2023 - 18:46

Best Credit Card Cashback Offers: దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండుగ సీజన్‌ నడుస్తోంది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా చాలా మంది షాపింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో చాలా ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ సంస్థలు పలు రకాల ఆఫర్లను ప్రకటించాయి. వీటితోపాటు వివిధ బ్యాంకులు తమ క్రెడిట్‌కార్డులతో షాపింగ్‌ చేస్తే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తున్న కొన్ని క్రెడిట్‌ కార్డుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తమ క్రెడిట్‌కార్డ్‌తో ఎటువంటి ఇబ్బందికరమైన వ్యాపారి పరిమితులు లేకుండా ఆన్‌లైన్ షాపింగ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అదే ఆఫ్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తే అదనంగా మరో 1 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఇక డిజిటల్ లావాదేవీలపై రివార్డ్‌ పాయింట్లు కూడా లభిస్తాయి. అయితే, క్యాష్‌బ్యాక్ నెలకు రూ. 5,000 మాత్రమే ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్
యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు అనువైనది. గూగుల్‌పే ద్వారా బిల్లు చెల్లింపులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. అలాగే స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై 4 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈ క్రెడిట్‌ కార్డుతో పొందవచ్చు. అయితే, ఈ క్యాష్‌బ్యాక్‌ల గరిష్ట మొత్తం నెలకు రూ. 500 మాత్రమే.  అదనంగా ఈ కార్డ్ ఇతర అన్ని చెల్లింపులపైనా 2 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ సంయుక్తంగా ఈ క్రెడిట్‌ కార్డ్‌ను తీసుకొచ్చాయి. ఈ క్రెడిట్‌ కార్డ్‌ ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది. దీంతోపాటు స్విగ్గీ, క్లయర్‌ట్రిప్‌, కల్ట్‌ఫిట్‌, పీవీఆర్‌, టాటా ప్లే, ఉబెర్‌ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో చెల్లింపులపై 4 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో విమాన, హోటల్ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ క్రెడిట్‌ కార్డ్‌ క్యాష్‌బ్యాక్‌లను ఎలాంటి పరిమితి లేకుండా నెలంతా వినియోగించుకోవచ్చు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)