యూపీఐ ద్వారా క్రెడిట్‌ కార్డు చెల్లింపు ఎలాగంటే..

Published on Fri, 01/10/2025 - 14:56

ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రధానంగా యూపీఐని ఎక్కువ మంది వాడుతుండడంతో, క్రెడిట్ కార్డు(credit card) వినియోగదారులు కొనుగోళ్లు చేయడానికి డిజిటల్ చెల్లింపులను ఎంచుకుంటున్నారు. తిరిగి కార్డు బిల్లులు చెల్లించేందుకు కూడా యూపీఐను ఎంచుకుంటే మరింత సులువుగా పేమెంట్స్‌ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే యూపీఐ చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేయడం ఎలా?

  • మొదటిసారి యూపీఐని ఉపయోగిస్తుంటే, డిజిటల్ చెల్లింపులు చేయడానికి, మీ క్రెడిట్ కార్డు(credit card)లను ఉపయోగించడానికి భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

  • క్రెడిట్ కార్డును యూపీఐతో జత చేయాలి. అందుకు యాప్ ఓపెన్ చేసి ‘యాడ్ పేమెంట్ మెథడ్’ విభాగానికి వెళ్లాలి.

  • క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకుని క్రెడిట్ కార్డ్ నంబర్, సివీవీ, ఎక్స్‌పైరీ తేదీ వంటి వివరాలను ఇవ్వాలి.

  • తర్వాత మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్‌(ఓటీపీ) వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయాలి. దాంతో యూపీఐకు కార్డు లింక్‌ అవుతుంది.

  • క్రెడిట్ కార్డు ఖాతాను లింక్ చేసిన తర్వాత కార్డుతో యూపీఐ ఐడీని సృష్టించాలి. యూపీఐ ఐడీ అనేది సంఖ్యలు, అక్షరాలు, స్పెషల్‌ సింబల్స్‌ కలిగిన ఒక ప్రత్యేక గుర్తింపు. మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన ఈ ఐడీ యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడానికి, స్వీకరించడానికి సహాయపడుతుంది.

  • యూపీఐ ఐడీ చెక్ చేసుకోవడానికి యాప్‌లోని ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి ‘యూపీఐ ఐడీ’ని ఎంచుకోవాలి.

ఇదీ చదవండి: మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం

క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయడం ఎలా?

  • క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. లేదా ‘పే ఫోన్ నంబర్’ లేదా ‘పే కాంటాక్ట్స్’ వంటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • తర్వాత యూపీఐ ఐడీని ఎంటర్‌ చేయాలి. యాప్ క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్ లేదా కాంటాక్ట్ నంబర్‌ను ధ్రువీకరించిన తర్వాత, బదిలీ చేయాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి.

  • తర్వాత చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.

  • యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేసి లావాదేవీ(UPI payments)ని పూర్తి చేయాలి.

  • యాప్‌లో సంబంధిత చెల్లింపు ఎంపికల్లో ‘సెల్ఫ్ ట్రాన్స్ఫర్‌’ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)