క్రెడిట్‌ కార్డులకు పండగల బూస్ట్‌ 

Published on Sun, 09/28/2025 - 05:39

న్యూఢిల్లీ: పండగ సీజన్‌ డిమాండ్‌ నేపథ్యంలో బ్యాంకులు పోటాపోటీగా పెద్ద స్థాయిలో క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం ఆగస్టులో దాదాపు 7,00,000 కార్డులను ఇష్యూ చేశాయి. ఇది ఏడు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. దీంతో మొత్తం యాక్టివ్‌ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 11.23 కోట్లకు చేరింది. నెలవారీగా క్రెడిట్‌ కార్డులపై చేసే ఖర్చు రూ. 1.91 లక్షల కోట్లుగా నమోదైంది. వార్షికంగా 13.7 శాతం పెరిగింది. గతేడాది ఆగస్టులో ఈ వ్యయాలు రూ. 1.68 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

తాజాగా హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌ కార్డులపై కొనుగోలుదారులు చేసిన వ్యయాలు 24 శాతం పెరిగి ఏకంగా రూ. 53,873 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 33,063 కోట్లతో (24.8 శాతం వృద్ధి) ఎస్‌బీఐ కార్డ్‌ రెండో స్థానంలో ఉంది. పండగ సీజన్‌లో కస్టమర్లు గణనీయంగా ఖర్చు చేస్తున్న ధోరణి కనిపిస్తోందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ బిజినెస్‌ హెడ్‌ (క్రెడిట్‌ కార్డ్స్‌) ఫ్రెడరిక్‌ డిసౌజా తెలిపారు. ట్రావెల్, లైఫ్‌స్టయిల్‌లాంటి అంశాలపై వ్యయం చేయడం పెరిగిందని పేర్కొన్నారు. పన్నులపరమైన ప్రయోజనాలు కూడా తోడు కావడం వల్ల క్రెడిట్‌ కార్డుల వినియోగం మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్లు వివరించారు.

 ఎప్పట్లాగే ఆన్‌లైన్‌ లావాదేవీలు అత్యధికంగా ఉంటున్నాయని, కార్డుల వినియోగానికి ఎల్రక్టానిక్స్, ట్రావెల్, లైఫ్‌స్టయిల్‌ కొనుగోళ్లు దన్నుగా నిలుస్తున్నాయని డిసౌజా పేర్కొన్నారు. వినియోగదారులు ప్రీమియం, మరింత ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపే ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు. అలాగే జీఎస్‌టీ ప్రయోజనాలను తెలియజేస్తూ, ప్రత్యేక డిస్కౌంట్లు, ఈజీ పేమెంట్‌ ఆప్షన్లు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో కంపెనీలు దూకుడుగా పండగ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండటం కూడా వ్యాపారాలకు మరింతగా ఊతమివ్వగలదని పేర్కొన్నారు. పీడబ్ల్యూసీ ఇండియన్‌ పేమెంట్స్‌ హ్యాండ్‌బుక్‌ ప్రకారం, జెన్‌–జడ్‌ వినియోగదారుల సెగ్మెంట్లో, ద్వితీయ..చిన్న నగరాల్లో క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరుగు తోంది.

డేటా ఇలా.. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జూలైలో జారీ చేసిన 3,15,000 కార్డులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, మిగతా బ్యాంకులతో పోలిస్తే అత్యధికంగా 2,21,000 కొత్త కార్డులను జారీ చేసింది. దీంతో ఆ బ్యాంకులోని మొత్తం కార్డుల సంఖ్య 2.5 కోట్లకు చేరింది. 1,40,000 కొత్త కార్డులతో యాక్సిస్‌ బ్యాంక్‌ రెండో స్థానంలో నిల్చింది. జూలైలో జారీ చేసిన 1,22,000 కార్డులను కూడా కలిపితే మొత్తం కార్డుల సంఖ్య 1.53 కోట్లకు చేరింది. అటు ఐసీఐసీఐ బ్యాంక్‌ తాజాగా 1,30,000 ఇష్యూ చేయడంతో మొత్తం సంఖ్య 1.81 కోట్లకు ఎగిసింది. జూలైలో నమోదైన 67,664 కార్డులతో పోలిస్తే బ్యాంకు ఆగస్టులో రెట్టింపు సంఖ్యలో జారీ చేసింది. ఇక రెండో అతి పెద్ద ఇష్యూయర్‌ అయిన ఎస్‌బీఐ కార్డ్స్‌ కొత్తగా 69,531 ఇష్యూ చేయడంతో మొత్తం కార్డుల సంఖ్య 2.13 కోట్లకు చేరింది. అయితే, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కార్డులు మాత్రం 1,00,000 తగ్గడంతో మొత్తం యాక్టివ్‌ కార్డుల సంఖ్య 45 లక్షలకు తగ్గింది. అయినప్పటికీ పండగ సీజన్‌పై బ్యాంకు ఆశావహంగా ఉంది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)