Breaking News

కార్పొరేట్లకూ దసరా జోష్‌!

Published on Thu, 09/25/2025 - 05:08

కోల్‌కతా: దసరా నవరాత్రి వేడుకలను కంపెనీలు మార్కెటింగ్‌ మంత్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ సందర్భంగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ, వినియోగదారులకు మరింత దగ్గరయ్యే దిశగా మార్కెటింగ్‌ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా దుర్గా పూజలను పెద్ద ఎత్తున నిర్వహించే పశ్చిమబెంగాల్‌ వంటి ప్రాంతాల్లో థీమ్డ్‌ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నాయి. 

టీపొడి, వ్యక్తిగత సంరక్షణ నుంచి ఫ్యాషన్, పాదరక్షలు, లైటింగ్, సాంకేతికత వరకు.. బ్రాండ్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు ఆవిష్కరణలకు సంప్రదాయాన్ని జోడిస్తున్నాయి. పండుగల రోజుల్లో షాపింగ్‌కు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుంటారు. అందులోనూ దసరా రోజుల్లో ఖరీదైన కొనుగోళ్లు ఎక్కువగా నమోవుతుంటాయి. ఈ సమయంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలతో విక్రయాలను పెంచుకోవడమే కాకుండా, వినియోగదారులతో దీర్ఘకాల భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కంపెనీలు చూస్తుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 ‘‘పండుగ కార్యక్రమాలు బ్రాండ్ల నిర్మాణానికి కీలకం. వినియోగదారుల సెంటిమెంట్‌ గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో వారితో అనుబంధానికి వీలు కలి్పస్తాయి’’అని పర్సనల్‌కేర్‌ బ్రాండ్‌ జోయ్‌ సీఎంవో పౌలోమీ రాయ్‌ తెలిపారు. మింత్రా జబాంగ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ప్రీమియం ఎతి్నక్‌ వేర్‌ లేబుల్‌ ‘సౌరాగ్య’ను మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీతో కలసి రూపొందించింది. సౌరవ్‌ విజన్‌ అయిన అసలైన బెంగాలీ ఫ్యాషన్‌ ఈ భాగస్వామ్యానికి మూలమని మింత్రా అధికార ప్రతినిధి చెప్పారు. దీంతో సౌరవ్‌ గంగూలీ ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టయిందన్నారు.  

ఇమామీ గోధుమ పిండి 
దసరా ముందు గోధుమ పిండి బ్రాండ్‌ను విడుదల చేయడం ద్వారా ఇమామీ ఆగ్రోటెక్‌ స్టేపుల్స్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన చెక్కీ ఫ్రెష్‌ ఆటా పిండితో రూపొందించిన దుర్గామాత విగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. పశి్చమబెంగాల్‌ కళ, సంస్కృతిని ప్రతిబింబిస్తూ టాటా టీ కంపెనీ టాటా టీ గోల్డ్‌ బ్రాండ్‌ ప్రచారాన్ని చేపట్టింది. ఐదుగురు బెంగాలీ కళాకారులు రూపొందించిన డిజైన్లతో లిమిటెడ్‌ ఎడిషన్‌ టాటా టీ గోల్డ్‌ను విడుదల చేసింది. 

ఈ డిజైన్లు దుర్గా పూజల ప్రత్యేకతను చాటనున్నాయి. ఏడబ్ల్యూఎల్‌ అగ్రి బిజినెస్‌ సైతం దసరా సందర్భంగా తన ఫారŠూచ్యన్‌ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. సంప్రదాయ వేడుకలు, సంబరాల్లో పాలు పంచుకునేందుకు పండుగలు అవకాశం కలి్పస్తాయని కంపెనీ సేల్స్‌ జాయింట్‌ ప్రెసిడెంట్‌ ముకేశ్‌ మిశ్రా తెలిపారు. కొత్త ఉత్పత్తులు, ప్రచారాలతో తమ విక్రయాలు పెంచుకోవడమే కాకుండా, వినియోదారులకు చేరువ అయ్యేందుకు ఈ సీజన్‌ను ఒక చక్కని అవకాశంగా భావిస్తూ ముందుకు వెళుతున్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)