Breaking News

పత్తి దిగుమతులకు సుంకాల నుంచి మినహాయింపు

Published on Sun, 05/31/2026 - 07:17

న్యూఢిల్లీ: పత్తి దిగుమతులకు అయిదు నెలల పాటు అన్ని రకాల కస్టమ్స్‌ సుంకాల నుంచి మినహాయింపునిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. దేశీయంగా టెక్స్‌టైల్‌ పరిశ్రమకు కాటన్‌ లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని వివరించింది. టెక్స్‌టైల్, అపారెల్‌ పరిశ్రమకు ముడి సరుకు వ్యయాలు తగ్గడానికి, దేశీయ రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే తయారీ సంస్థలు, వినియోగదారులకు ఊరటనిచ్చేందుకు దోహదపడగలదని తెలిపింది.  

టెక్స్‌టైల్‌ పరిశ్రమ ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశీయ మార్కెట్లో పత్తి లభ్యతపై ఒత్తిడి ఉండటంతో పాటు ముడి సరుకు ధరలు పెరగడం వల్ల స్పిన్నింగ్‌, గార్మెంట్‌ తయారీ యూనిట్లు వ్యయభారం ఎదుర్కొంటున్నాయని వారు పేర్కొన్నారు. దిగుమతి సుంకాల మినహాయింపుతో విదేశాల నుంచి తక్కువ ఖర్చుతో పత్తిని దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుందని, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా టెక్స్‌టైల్‌ సంస్థలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. అలాగే భారత టెక్స్‌టైల్‌, అపారెల్‌ ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడంతో పాటు ఉత్పత్తి చక్రం అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)