Breaking News

ఫలితాల సీజన్‌తో జోష్‌!

Published on Mon, 04/08/2024 - 01:06

ముంబై:  ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు కార్పొరేట్‌ ఫలితాలు జోష్‌నివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్‌ సేవలకు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తున్న టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసిక ఫలితాలతో సీజన్‌ను ప్రారంభించనుంది. శుక్రవారం(12న) టీసీఎస్‌ జనవరి–మార్చి(క్యూ4)తోపాటు పూర్తి ఏడాదికి సైతం ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ఇదే రోజు ఆర్థిక గణాంకాలు సైతం వెలువడనున్నాయి.

ప్రభుత్వం(ఎన్‌ఎస్‌వో) మార్చి నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను విడుదల చేయనుంది. అంతేకాకుండా ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి వివరాలు సైతం వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో సీపీఐ నామమాత్ర వెనకడుగుతో 5.09 శాతానికి చేరింది. ఇక పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) జనవరిలో 3.4 శాతంగా నమోదైంది. కాగా.. గురువారం(11న) ఈద్‌(రంజాన్‌) సందర్భంగా స్టాక్‌ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది.  

గత వారం రికార్డు
గత వారం ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. చివరికి శుక్రవారంతో ముగిసిన గత వారం సెన్సెక్స్‌ 597 పాయింట్లు(0.8 శాతం) లాభపడి 74,248 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ సైతం 187 పాయింట్లు(0.84 శాతం) ఎగసి 22,514 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్‌ కొనసాగడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3.84 శాతం జంప్‌చేసి 40,831 వద్ద నిలిచింది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ మరింత అధికంగా 6.64 శాతం దూసుకెళ్లి 46,033 వద్ద ముగిసింది.

చమురు, రూపాయి ఎఫెక్ట్‌
ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని స్టాక్‌ నిపుణులు ప్రస్తావించారు. అంతేకాకుండా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకాగలవని పేర్కొన్నారు. మరోవైపు రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్‌ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.

గత వారం డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరువైన నేపథ్యంలో ఆరు ప్రపంచ కరెన్సీలతో డాలరు మారకపు విలువ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. విదేశీ అంశాల విషయానికివస్తే గత వారాంతాన మార్చి నెలకు యూఎస్‌ వ్యవసాయేతర రంగాలలో ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెలువడ్డాయి. వీటితోపాటు ఈ నెల 10న(బుధవారం) యూఎస్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి.

ఇటీవల చేపట్టిన పాలసీ సమీక్షలో యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌.. ఫండ్స్‌ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీయంగా సైతం ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఏడోసారీ యథాతథంగా 6.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. సీపీఐ లక్ష్యాన్ని 4.5 శాతంగా పేర్కొంది. 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)