జూలైలో కార్పొరేట్‌ డీల్స్‌ 3.1 బిలియన్‌ డాలర్లు

Published on Sat, 08/19/2023 - 05:09

ముంబై: కార్పొరేట్‌ డీల్స్‌ (ఒప్పందాలు) విలువ జూలై నెలలో 58 శాతం పెరిగి 3.1 బిలియన్‌ డాలర్లుగా (రూ.25,730 కోట్లు) నమోదైంది. మొత్తం మీద డీల్స్‌ సంఖ్య తగ్గింది. ఈ వివరాలను గ్రాంట్‌ థార్న్‌టన్‌ విడుదల చేసింది. జూలైలో మొత్తం 3.1 బిలియన్‌ డాలర్ల కార్పొరేట్‌ ఒప్పందాలు నమోదయ్యాయి. విలువ పరంగా 58 శాతం పెరిగినా, సంఖ్యా పరంగా చూస్తే 46 శాతం తగ్గాయి.

అంతర్జాతీయంగా మందగమనం కార్పొరేట్‌ డీల్స్‌పై ప్రభావం చూపించినట్టు గ్రాంట్‌ థార్న్‌టన్‌ పార్ట్‌నర్‌ శాంతి విజేత తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి కార్పొరేట్‌ డీల్స్‌ విభాగంలో స్తబ్ధత ఉన్నట్టు చెప్పారు. సీమాంతర లావాదేవీలు డీల్స్‌ విలువ పెరగడానికి దోహదపడినట్టు చెప్పారు. అదే సమయంలో ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లలో అప్రమత్తత ఉండడంతో డీల్స్‌ సంఖ్య తగ్గినట్టు తెలిపారు.

ముఖ్య డీల్స్‌..  
► 29 డీల్స్‌ విలువ 2 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  
► రూట్‌ మొబైల్‌లో 58 శాతం వాటా కొనుగోలుకు 721 మిలియన్‌ డాలర్లతో ప్రాక్సిమస్‌ ఓపల్‌ కుదుర్చుకున్న డీల్‌ అతిపెద్దదిగా ఉంది.  
► అదానీ క్యాపిటల్, అదానీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 90 శాతం వాటా కొనుగోలుకు బెయిన్‌ క్యాపిటల్‌ 176 మిలియన్‌ డాలర్లతో డీల్‌ కుదుర్చుకోవడం గమనార్హం.  
► నాలుగు క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) విలువ 668 మిలియన్‌ డాలర్లుగా ఉంది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)