Breaking News

కంపెనీల ఆదాయం వృద్ధి: రంగాల వారీ పనితీరు ఇలా..

Published on Sun, 10/26/2025 - 11:19

భారత కంపెనీల ఆదాయం, సెప్టెంబర్‌ త్రైమాసికంలో.. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 5 - 6 శాతం పెరగొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. లాభదాయకత అర శాతం వరకు తగ్గొచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది. నిర్వహణ మార్జిన్లు 0.60 శాతం తక్కువ నమోదు కావొచ్చని తెలిపింది. విద్యుత్, బొగ్గు, ఐటీ సేవలు, ఉక్కు రంగాల్లో మెరుగైన పనితీరు ఆదాయ వృద్ధికి అనుకూలిస్తుందని పేర్కొంది. 600 కంపెనీల పనితీరును విశ్లేషించి అనంతరం క్రిసిల్‌ రేటింగ్స్‌ ఈ వివరాలను విడుదల చేసింది. ఈ ఏడాది జూన్‌ త్రైమాసికంతో పోల్చి చూస్తే కంపెనీల ఆదాయం ఒక శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది.

రంగాల వారీ పనితీరు అంచనా..

  • ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్, అల్యూమినియం రంగాల్లో పెరిగిపోయిన ముడిపదార్థాల వ్యయాలను కస్టమర్లకు పూర్తిగా బదిలీ చేసే విషయంలో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో నిర్వహణ లాభాల మార్జిన్‌ 0.50–1 శాతం వరకు తగ్గొచ్చు.

  • ఐటీ రంగంపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం కొనసాగుతోంది. ప్రాజెక్టులు వాయిదా పడుతుండడంతో ఆదాయ వృద్ధి ఒక శాతం మించకపోవచ్చు.  

  • స్టీల్‌ రంగంలో ఆదాయం 4 శాతం వరకు పెరగొచ్చు. ధరలు తగ్గడంతో అమ్మకాల పరిమాణం 9 శాతం అధికంగా ఉండొచ్చు.

  • విద్యుత్‌ రంగంలో కంపెనీల ఆదాయం ఒక శాతం మెరుగుపడుతుంది. అధిక వర్షపాతంతో జలవిద్యుత్‌ తగినంత ఉత్పత్తి కావడం, పునరుత్పాదక విద్యుత్‌ 10 శాతం పెరగడం ఆదాయ వృద్ధిని పరిమితం చేయొచ్చు. దీంతో బొగ్గు రంగం ఆదాయం ఫ్లాట్‌గా ఉండొచ్చు. 

  • అమ్మకాలు 31 శాతం పెరగడంతో ట్రాక్టర్ల తయారీదారుల ఆదాయం 36 శాతం అధికం కావొచ్చు. ద్విచక్ర వాహన కంపెనీల ఆదాయం 9 శాతం (అమ్మకాలు 6 శాతం పెరగడం వల్ల) పెరగొచ్చు.  

  • టెలికం కంపెనీలు 7 శాతం వరకు ఆదాయంలో వృద్ధిని చూపించొచ్చు. చందాదారుల వృద్ధి ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, అధిక టారిఫ్‌లతో కూడిన ప్లాన్లు ఇందుకు అనుకూలిస్తాయి.

  • సిమెంట్‌ అమ్మకాలు 6–7 శాతం వృద్ది చెందడంతో.. కంపెనీల ఆదాయం 8 శాతం వరకు పెరుగుతుంది.  

  • ఫార్మాస్యూటికల్‌ కంపెనీల మార్జిన్లు 1.5–2 శాతం వరకు, అల్యూమినియం కంపెనీల మార్జిన్లు 1–1.5 శాతం వరకు తగ్గుతాయి.  

  • సిమెంట్, స్టీల్, టెలికం కంపెనీల మార్జిన్లు మెరుగుపడతాయి.

గ్రామీణ ప్రాంతాల్లో సానుకూలత
‘‘జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణతో కొత్త ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్యాసింజర్‌ వాహనాలు, ఎఫ్‌ఎంసీజీ రంగంలో తాత్కాలిక అవరోధాలు నెలకొన్నాయి. రిటైలర్లు, పంపిణీదారులు ఎఫ్‌ఎంసీజీ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. అప్పటికే నిల్వలు ఉండడం, రిటైల్‌ అమ్మకాలు స్తబ్దుగా ఉండడం క్యూ2లో ప్యాసింజర్‌ వాహనాల డిమాండ్‌పై ప్రభావం చూపించింది. వర్షాలు సమృద్ధిగా పడడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించింది. ఖరీఫ్‌ పంటలకు మద్దతు ధరలను పెంచడంతో రైతుల్లో సానుకూల సిమెంట్‌ నెలకొంది. ఇది ట్రాక్టర్లు, ద్విచక్ర వాహన విక్రయాలు పెరిగేందుకు దారితీసింది’’అని క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ పూషణ్‌ శర్మ తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)