Breaking News

ఫిబ్రవరిలో నిదానించిన మౌలిక రంగం 

Published on Sat, 03/29/2025 - 06:24

న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో మౌలిక రంగం నిదానించింది. ఎనిమిది మౌలిక రంగాల్లో ఉత్పత్తి 2.9 శాతం మేర పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 7.1 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గింది. అంతే కాదు ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలోనూ కీలక మౌలిక రంగాల్లో 5.1 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది సెపె్టంబర్‌లో వచ్చిన 2.4 శాతం వృద్ధి చివరి కనిష్ట స్థాయిగా ఉంది. 

ముఖ్యంగా ఫిబ్రవరిలో ముడి చమురు, సహజ వాయువు రంగాల్లో ప్రతికూల వృద్ధి (క్షీణత) కనిపించింది. బొగ్గు ఉత్పత్తి 1.7 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ రంగంలో 11.6 శాతం వృద్ధి నమోదు కావడం గమనించొచ్చు. రిఫైనరీ ఉత్పత్తుల్లో వృద్ధి క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 2.6 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గిపోయింది.

 స్టీల్‌ ఉత్పత్తి 9.4 శాతం నుంచి 5.6 శాతానికి.. విద్యుదుత్పత్తి  7.6 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఎరువుల ఉత్పత్తి 10.2 శాతం, సిమెంట్‌ ఉత్పత్తి 10.5 శాతం చొప్పున వృద్ధి చెందడం కొంత కలిసొచ్చింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు మొత్తం 11 నెలల్లో ఈ ఎనిమిది మౌలిక రంగాల్లో వృద్ది 4.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 7.8 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ ఎనిమిది మౌలిక రంగాల వాటా 40.27 శాతంగా ఉంది.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)