Breaking News

భారత కంపెనీకి విమాన డోర్లు తయారుచేసే కాంట్రాక్ట్‌

Published on Fri, 02/09/2024 - 11:34

ఎయిర్‌బస్‌కు చెందిన ఏ220 విమానాల డోర్లు ఇకపై భారత్‌లోనే తయారవనున్నాయి. ఈ మేరకు దేశీయ సంస్థ డైనమెటిక్‌ టెక్నాలజీస్‌తో ఒప్పందం జరిగినట్లు యూరప్‌కు చెందిన విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌ గురువారం ప్రకటించింది. 

భారతీయ విమానయాన రంగ తయారీ సంస్థకు దక్కిన అతిపెద్ద ఎగుమతి కాంట్రాక్టుల్లో ఇది కూడా ఒకటని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. విమానాల విడిభాగాల తయారీలో భారత్‌ కీలకంగా మారుతుందని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో భారత్‌ ఏగుమతి చేసే సేవలు, విమాన విడిభాగాల విలువను 1.5 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. ప్రస్తుతం ఈ మార్కెట్‌ 750 మిలియన్‌ డాలర్లుగా ఉందని చెప్పారు. 

ఇదీ చదవండి: లిథియం బ్లాక్‌ల వేలంలో పాల్గొననున్న ప్రముఖ కంపెనీ?

ఈ కాంట్రాక్టులో భాగంగా డైనమెటిక్‌ టెక్నాలజీస్‌ ఎయిర్‌బస్‌ 220 కార్గో, ప్యాసింజర్‌ విమానాల డోర్లను తయారీచేయనుంది. అందుకు సంబంధించి సర్వీసింగ్‌ను అందించనుంది. ఒక్కో విమానానికి 8 డోర్లుంటాయి. ఈ డోర్లతోపాటు వాటికి సంబంధించిన అన్ని విడిభాగాలనూ సంస్థ తయారు చేస్తుంది. ఇప్పటికే ఎయిర్‌బస్‌కు చెందిన ఏ330, ఏ320 విమానాల ఫ్లాప్‌ ట్రాక్‌ బీమ్‌లనూ ఈ సంస్థే తయారు చేస్తుండటం విశేషం. అలాగే ఏ220 విమానాల్లో కాక్‌పీట్‌ ఎస్కేప్‌ హ్యాచ్‌ డోర్లనూ ఉత్పత్తి చేస్తోంది.

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)