Breaking News

వేసవి కాలం కంపెనీలకు లాభం!

Published on Mon, 02/10/2025 - 13:11

వేసవి కాలం సమీపిస్తుండటంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించి అమ్మకాలను పెంచుకునేందుకు కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు మెగా మార్కెటింగ్‌కు సిద్ధమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఐపీఎల్‌ వంటి ప్రధాన ఈవెంట్లు, వేసవి సెలవులు ప్రారంభంకానుండడంతో అధిక డిమాండ్ నెలకొంటుందని సంస్థలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వివిధ విభాగాలకు చెందిన కంపెనీలు కొత్త బ్రాండ్ల ఆవిష్కరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

ప్రధాన ఈవెంట్లు..

వేసవిలో వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి ముఖ్యమైన ఈవెంట్లను సద్వినియోగం చేసుకోవడం కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల కీలక వ్యూహాల్లో ఒకటి. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి, ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు ఐపీఎల్‌ భారీ వేదిక కానుంది. కోకాకోలా, హావ్‌మోర్‌ ఐస్‌క్రీమ్, రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్.. వంటి సంస్థలు ప్రమోషన్ క్యాంపెయిన్స్ సిద్ధం చేస్తూ ఐపీఎల్ సీజన్ కోసం ప్రత్యేకంగా ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. చాలా కంపెనీలు తమ బ్రాండ్‌ సాఫ్ట్‌ డ్రింక్స్‌, ఐస్ క్రీములు, రిఫ్రెషింగ్ స్నాక్స్ వంటి ప్రత్యేకమైన ఉత్పత్తులపై దృష్టి పెడుతున్నాయి. ఉదాహరణకు, హావ్‌మోర్‌ ఐస్ క్రీమ్ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా ప్రీమియం ప్యాక్‌లను ప్రవేశపెడుతోంది. వేసవి సీజన్‌ను అదనుగా తీసుకొని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తన స్పోర్ట్స్ డ్రింక్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు ఐపీఎల్ జట్లలో రైట్స్ దక్కించుకుంది.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.6,000 కోట్లు.. కేబినెట్‌ ఆమోదం

పెరిగిన ప్రకటన వ్యయాలు

వేసవి నెలల్లో ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఉత్పత్తుల వినియోగం అధికమవడంతోపాటు అందుకు అనుగుణంగా ప్రకటన వ్యయాలు సైతం గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. తమ ఉత్పత్తులు పెద్దమొత్తంలో ప్రేక్షకులను చేరుకోవడానికి టెలివిజన్, డిజిటల్ ప్రకటనలు రెండింటిలోనూ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ సీజన్‌లో ఐపీఎల్ కోసం టెలివిజన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నుంచి మొత్తం యాడ్ రెవెన్యూ రూ.4,500 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇది గతేడాది కంటే 8-10 శాతం అధికం. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ప్రచారాలు ప్రత్యేకంగా, సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నాయి. ఉదాహరణకు, కోకాకోలా అమ్మకాలను పెంచడానికి డొమినోస్ స్టోర్లలో క్రాస్ ప్రమోషన్‌ చేస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)