Breaking News

కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్‌షిప్‌ - రూ.61 లక్షలు రీఫండ్!

Published on Wed, 09/13/2023 - 13:40

కారు కొనుగోలు చేయడం అనేది చాలామంది కల. ఈ కలను నిజం చేసుకోవడానికి కొంతమంది ఎన్నోన్నో కష్టాలు పడి చివరకు అనుకున్నది సాధిస్తారు. అయితే కొన్ని సార్లు డీలర్‌షిప్ యాజమాన్యం చేసే మోసాల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలు. మళ్ళీ ఇలాంటి సంఘటనే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

చండీగఢ్‌ ప్రాంతానికి చెందిన ఇందర్‌జిత్ కౌర్ అనే కస్టమర్ జీప్ కంపెనీకి చెందిన 'గ్రాండ్ చెరోకీ' కారుని 2018లో రూ. 61.61 లక్షలకు కొనుగోలు చేసాడు. నిజానికి ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర దేశీయ మార్కెట్లో రూ. 80 లక్షల కంటే ఎక్కువ. అయితే ఇది 2016లో తయారైందన్న కారణంతో స్థానిక KAS కార్స్ డీలర్‌షిప్ రూ. 17 లక్షలు తగ్గించింది.

కారు కొనుగోలు చేసిన తరువాత నుంచి అందులో సమస్యలు మొదలయ్యాయి. రోడ్డు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో కస్టమర్ డీలర్‌షిప్‌ను ఆశ్రయించాడు. వెళ్లిన ప్రతి సారి అప్పటికి ఏదో ఒక రిపేర్ చేసి బాగు చేసివారు. కానీ మళ్ళీ మళ్ళీ సమస్యలే తలెత్తుండటంతో కోర్టుని ఆశ్రయించాడు.

ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు!

కోర్టు విచారం చేపట్టి కస్టమర్ ఇబ్బందికి కారణమైన డీలర్‌షిప్‌కి కేవలం 45 రోజుల గడువులో రూ. 61.61 లక్షలు అతని చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా కంపెనీలు కస్టమర్లకు లోపభూయిష్టమైన కార్లను విక్రయించడం వల్ల భారీ జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)