Breaking News

షాపింగ్‌ మాల్స్‌ సందడి, ఎన్ని పెరిగాయో తెలుసా?   

Published on Thu, 09/15/2022 - 08:52

న్యూఢిల్లీ: దేశంలో షాపింగ్స్‌ మాల్స్‌ వేగంగా విస్తరిస్తున్నాయి. 2020 నుంచి 8 ప్రధాన పట్టణాల్లో 16 కొత్త మాల్స్‌ తెరుచుకున్నాయి. కరోనా వంటి ఎన్నో ప్రతికూలతలు, సవాళ్లు ఉన్నా కానీ.. కొత్త మాల్స్‌ రూపంలో 15.5 మిలియన్‌ చదరపు అడుగులు వాణిజ్య స్థలం గత 30 నెలల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు నైట్‌ఫ్రాంక్‌ ‘థింక్‌ ఇండియా, థింక్‌ రిటైల్‌ 2022’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2019 డిసెంబర్‌ నాటికి దేశంలోని హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలో 255 మాల్స్, వీటి నుంచి స్థూల లీజు విస్తీర్ణం 77.4 మిలియన్‌ చదరపు అడుగులు అందుబాటులో ఉంది. 2022 జూన్‌ నాటికి భారత్‌లో మొత్తం 92.9 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణం, 271 మాల్స్‌రూపంలో ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది.  

గ్రేడ్‌ ఏ మాల్స్‌కు డిమాండ్‌..  
దేశ రాజధాని ప్రాంతంలో అత్యధికంగా 34 శాతం షాపింగ్‌ మాల్‌ విస్తీర్ణం ఏర్పాటై ఉంది. ముంబై 18 శాతం, బెంగళూరు 17 శాతం వాటా కలిగి ఉన్నాయి. ‘‘రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్త పరిపక్వత దశకు చేరుకుంది. చిన్న సైజు నుంచి గ్రేడ్‌ ఏ మాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్‌ ఏ మాల్స్‌లో95 శాతం లీజు స్థలం నిండి ఉంది. నాణ్యమైన రియల్‌ ఎస్టేట్‌కు డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది. డెవలపర్ల నుంచి నాణ్యమైన ప్రాజెక్టుల అభివృద్ధి అవసరం’’అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు.

రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం.. పెట్టుబడులకు, రీట్‌లకు గొప్ప అవకాశం కల్పిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో 39 శాతం విస్తీర్ణం గ్రేడ్‌ ఏ పరిధిలో ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్‌ నివేదిక తెలిపింది. వీటి పరిధిలో స్థూల లీజు విస్తీర్ణం 36 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. టాప్‌–8 పట్టణాల్లో మొత్తం గ్రేడ్‌ ఏ మాల్స్‌ 52 ఉన్నాయి. గ్రేడ్‌ బీ కేటగిరీలో 94 మాల్స్‌ ఉండగా, 29.1 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు అందుబాటులో ఉంది. గ్రేడ్‌ సీ పరిధిలో 125 మాల్స్‌ 27.8 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉన్నాయి.  

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)